మ‌న దేశానికి మొద‌టి ప్ర‌ధాని మోడీ అట‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న న్యూస్‌..!

ఇప్పుడు మేం మిమ్మ‌ల్ని ఓ సింపుల్ ప్ర‌శ్న అడుగుతున్నాం. స‌మాధానం చెప్పండి.. మ‌న దేశానికి మొద‌టి ప్ర‌ధాన మంత్రి ఎవ‌రు ? ఇదేం ప్ర‌శ్న‌.. దీనికి సమాధానం తెలియ‌ని వారు కూడా ఉంటారా.. అని మీరు ఆశ్చ‌ర్య‌పోకండి. ఎందుకంటే.. ఈ ప్ర‌శ్న‌కు 1వ త‌ర‌గ‌తి చ‌దివే బాలుడు కూడా స‌మాధానం చెబుతాడు. మాకు తెలుసు. కానీ.. సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఉంది క‌దా.. అది అందించే సెర్చ్ సైట్‌కు మాత్రం మ‌న దేశానికి మొద‌టి ప్ర‌ధాని ఎవ‌రో తెలియ‌దు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన సెర్చ్ ఇంజ‌న్ www.google.com ఉంది క‌దా. అందులో మ‌నం ఏదైనా స‌మాచారం వెదికితే దానికి సంబంధించిన రిలేటెడ్ లింక్‌లు కింద రిజల్ట్స్ సెక్ష‌న్‌లో క‌నిపిస్తాయి. అయితే అవి అంత క‌చ్చిత‌త్వంతో ఉండ‌వు. వాటిల్లో ఎంతో కొంత మిస్టేక్ ఉంటుంది. మ‌న‌కు కావ‌ల్సిన స‌మాచారం ఒక్కోసారి 100 శాతం దొరుకుతుంది. కొన్ని సార్లు అస‌లు దొర‌క‌దు. ఇది అలా ఉంచితే.. ఆ సైట్‌లో సెర్చ్ బార్‌లో India first PM అని టైప్ చేసి సెర్చ్ చేసి చూడండి. రిజ‌ల్ట్ ఏం వ‌చ్చింది. షాకింగ్‌గా ఉంది క‌దా..! అవును..

గూగుల్ సెర్చ్‌లో India first PM అని సెర్చ్ చేస్తే మ‌న దేశానికి మొద‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ అని రావాలి. పక్క‌నే ఆయ‌న ఫొటో ఉండాలి. కానీ పేరు వ‌ర‌కే క‌రెక్ట్ చూపిస్తోంది. ఫొటో మాత్రం మోడీది వ‌స్తోంది. దీంతో ఈ విష‌యం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మే అయింది. ఇక దీనిపై కాంగ్రెస్ నాయ‌కులు అరిచి గోల చేస్తున్నారు కూడా. బీజేపీయే కావాల‌ని అలా చేసిందని వారు ఆరోపిస్తున్నారు. ఇక నెటిజ‌న్లు అయితే ఈ విష‌యంపై జోకులు వేసుకుంటున్నారు. అయితే గూగుల్ లో ఇలా త‌ప్పుడు రిజ‌ల్ట్స్ రావ‌డం ఇదేం కొత్త కాదు. గ‌తంలోనూ ప‌లు ప‌దాల‌ను సెర్చ్ చేస్తే ఇలాంటి వింత రిజల్ట్సే వ‌చ్చాయి.

ఒక‌సారి గూగుల్‌లో టాప్ టెన్ క్రిమిన‌ల్స్ అని సెర్చ్ చేస్తే ప్రధాని మోడీ ఫొటోలు వ‌చ్చాయి. దీంతో గూగుల్ ఆ త‌ప్పును స‌రి చేసుకుంది. త‌రువాత Namak haram country అని సెర్చ్ చేస్తే ఇండియా పేరు వ‌చ్చింది. త‌రువాత గూగుల్ ఆ మిస్టేక్‌ను కూడా స‌రి చేసుకుంది. త‌రువాత కూడా ప‌లు మార్లు ఇలాగే ప‌లు ప‌దాల‌కు వింతైన‌, అనుచిత‌మైన రిజల్ట్స్ వ‌చ్చాయి. దీంతో గూగుల్ అభాసుపాలైంది. ఇప్పుడు కొత్తగా మ‌ళ్లీ ఈ ప‌దంతో మ‌రోసారి గూగుల్ సెర్చ్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే గూగుల్ ఈ మిస్టేక్‌ను స‌రిచేస్తుందా ? చూద్దాం..!

 

Comments

comments

Share this post

scroll to top