ప్రపంచంలో మొదటి ఏటీఎం అది, ఎక్కడ ఉందో, దానికి ఏం చేశారో తెలుసా..?

ఇన్‌స్టంట్‌గా డబ్బులు కావాలంటే మనం వెంటనే డెబిట్/ఏటీఎం కార్డు తీసుకుని దగ్గర్లోని ఏటీఎంకు వెళ్లి డబ్బులను డ్రా చేస్తాం. బ్యాంకులు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే మీకు తెలుసా..? అసలు మొదటిసారిగా ఏటీఎం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైందో..? అది ఇప్పుడు ఉందో, లేదో తెలుసా..? అదే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి ఏటీఎం 50 ఏళ్ల కిందటే వచ్చింది. జూన్ 27, 1967వ తేదీన ఉత్తర లండన్‌లోని ఎన్‌ఫీల్డ్ ఏరియాలో బార్క్‌లే బ్యాంక్ బ్రాంచ్‌లో ఏటీఎంను ఏర్పాటు చేశారు. దాన్ని స్కాటిష్ వ్యక్తి షెఫర్డ్ బ్యారెన్ తయారు చేశాడు. అయితే ఆ ఏటీఎం నుంచి మొదటి సారిగా డబ్బులు తీసింది ఎవరో తెలుసా..? బ్రిటిష్ టీవీ నటుడు రెగ్ వార్నీ. ఈ క్రమంలో తాజాగా జూన్ 27వ తేదీకి ఈ ఏటీఎం మిషన్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.

దీంతో సదరు ఏటీఎం మెషిన్‌కు బ్యాంక్ అధికారులు బంగారు పూత పూశారు. నూతనంగా దానికి హంగులు దిద్దారు. ఆకర్షణీయంగా ఆ మెషిన్‌ను తయారు చేశారు. దీంతోపాటు మెషిన్ ఎదుట రెడ్ కార్పెట్ పరిచారు. ఈ క్రమంలో సదరు ఏటీఎం ద్వారా ఆ బ్యాంక్ తన కస్టమర్లకు కొత్తగా స్వాగతం పలుకుతోంది. అయితే మన దేశంలో ఏటీఎంను తొలిసారిగా ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేశారో తెలుసా… 30 ఏళ్ల క్రితం హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ ముంబైలోని అంధేరి ఈస్ట్ సహార్ రోడ్ బ్రాంచ్‌లో ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఏది ఏమైనా ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి కొత్త పద్ధతులు వచ్చినా, టెక్నాలజీ మార్పులు చెందిన ఏటీఎంలు మాత్రం ఇంకా తమ ప్రాభవాన్ని కోల్పోలేదు కదా..!

Comments

comments

Share this post

scroll to top