తండ్రి ఆస్తిలో కొడుకులకి, కూతళ్లకి ఎలాంటి హక్కులు ఉంటాయో తెలుసుకోండి.?

1956లో వచ్చిన మహిళ వారసత్వ హక్కు చట్టం మహిళలకు ఓ వరంలా మారింది. సెక్షన్ 14లో మహిళలకు పరిమితమైన ఆస్తి హక్కులు… సంపూర్ణమైన ఆస్తి హక్కులుగా మారతాయని చెప్పడం జరిగింది. మహిళలకు అప్పటి వరకు వచ్చిన ఆస్తిపై మాత్రమే హక్కులు ఉండేవి. అయితే 1985 సెప్టెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు ఉండాలని, ఆ ఆస్తి హక్కులు మగవారిలాగానే పుట్టినప్పటి నుంచి ఉండాలని మరొక చట్టాన్ని రూపొందించారు.

అవివాహితులైన మహిళలకు, సోదరులతో సమానంగా ఉమ్మడి ఆస్తిలో వాటా ఉండాలని రామారావు చట్టం చేసారు. సెప్టెంబర్ 9 1985 నాటికి ఎవరికైతే వివాహం కాలేదో వారు మాత్రమే దీనికి అర్హులు. ఎవరు అయితే అవివాహిత మహిళలున్నారో వారికి మాత్రమే ఆస్తిలో సమాన వాటా వచ్చేది.

తండ్రి స్వార్జిత ఆస్తితో పాటు తండ్రి తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో కూడా సోదరుడితో పాటు సమాన వాట ఉంటుంది. ఇది కేవలం మన రాష్ట్రానికి చెందిన చట్టం మాత్రమే. ఆ తర్వాత ఈ చట్టాన్ని కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలో అమలు చేసాయి. ఒక్కో రాష్ట్రం చట్టం చేసుకోవడంతో 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం సవరణ చట్టం చేసింది. డిసెంబర్ 2004 కల్లా తండ్రి జీవించి ఉంటే పెళ్లి అయినా కాకపోయినా ఆ ఆస్తిలో కూతురికి కూడా సమాన హక్కులు ఉంటాయని 1956లో చేసిన మహిళ వారసత్వ హక్కు చట్టానికి సవరణ చేసారు. ఈ చట్టాన్ని 9 సెప్టెంబర్ 2005లో అమలు చేసారు. అప్పటికే ఆస్తి పంపకాలు జరిగి ఉంటే కుమార్తెకు మరో వాటా రాదని… ఒకవేళ ఆస్తి పంపకాలు జరగకపోతేనే ఆమెకు ఆస్తి వస్తుందని సవరణ చట్టం చెబుతోంది.

Comments

comments

Share this post

scroll to top