ఈ 10 ఫొటోల్లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అవేమిటో క‌నిపెట్టండి చూద్దాం..!

నేటి పోటీ ప్ర‌పంచంలో ఇత‌రుల‌తో పోటీ ప‌డాలంటే మ‌న‌కు అన్ని అంశాల్లోనూ నైపుణ్యం ఉండి తీరాలి. ముఖ్యంగా మ‌న చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం.. వాటి గురించి తెలుసుకోవ‌డం ముఖ్యం. ఒక్కోసారి ఇంట‌ర్వ్యూల్లోనూ ఇలాంటి అంశాల‌పైనే ప్ర‌శ్న‌లు వేస్తారు. అభ్య‌ర్థుల‌కు త‌మ చుట్టూ ఉన్న ప‌రిస‌రాలు, వ‌స్తువుల‌పై ఎంత అవ‌గాహ‌న ఉందో తెలుసుకోవ‌డం కోసం ఇంట‌ర్వ్యూయ‌ర్లు చుట్టూ ఉన్న వాటి గురించి ప్ర‌శ్న‌లు అడుగుతుంటారు. అయితే కింద ఇచ్చింది కూడా అలాంటి ఫొటోల గురించే. నిజానికి వీటిని ఒక్క‌సారి చూస్తే అంత పెద్ద తేడా ఏమీ అనిపించ‌దు. కానీ జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే మాత్రం వాటిలో ప‌లు మిస్టేక్స్ మ‌న‌కు క‌నిపిస్తాయి. అవేమిటో మీరు క‌నిపెట్టండి మ‌రి..!

1. వ్యోమ‌గామి ఫొటో ఇది. ఇందులో ఉన్న త‌ప్పు ఏమిటో చెప్ప‌గ‌ల‌రా..?

2. వంతెనపై నుంచి న‌డుచుకుంటూ వెళ్తున్న పెద్ద మ‌నిషి. ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్ ఏమిటో క‌నిపెట్టండి.

3. అద్దంలో చూసి అత‌ను గ‌డ్డం చేసుకుంటున్నాడు. ఇందులో మిస్టేక్ ఏమి ఉంద‌బ్బా.

4. ఒకే మంచు దిమ్మెపై నిలుచున్న ధృవ‌పు ఎలుగుబంటి, పెంగ్విన్‌లు. ఇందులో ఉన్న మిస్టేక్ క‌నిపెట్టండి.

5. బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు కూర్చున్న చిన్నారులు. ఈ ఫొటోలో దాగి ఉన్న త‌ప్పును వెద‌కండి.

6. ఎడారిలో ప్ర‌యాణిస్తున్న ఒంటెలు. అయినా ఈ చిత్రంలో త‌ప్పుంది. అదేమిటి ?

7. లండ‌న్‌లో ఓ వీధి. అందులో త‌ప్పు వెద‌కండి.

8. ప‌చ్చని ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఉన్న ఇల్లు. ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్ చెప్పండి మ‌రి.

9. కొత్త దుస్తుల‌ను ట్రై చేస్తున్న యువ‌తి. ఫొటోలో మాత్రం చిన్న మిస్టేక్ ఉంది. అదేమిటి ?

10. చివ‌రిగా ఈ ఫొటోలో ఉన్న నాలుగు మిస్టేక్స్‌ను క‌నిపెట్టండి చూద్దాం.

జ‌వాబులు:

1. వ్యోమ‌గామి దిగిందే చంద్రుడి మీద‌. మ‌రి చిత్రంలో ఇంకో చంద్రుడు ఎలా ఉంటాడు. ఉండ‌డు క‌దా.

2. అటు వైపు కేవ‌లం కొండ మాత్ర‌మే ఉంది. న‌ది లేదు.

3. అతను ఓ వాంపైర్‌. అంటే పిశాచి. పిశాచులు అద్దాల్లో క‌నిపించ‌వు.

4. అవి రెండు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉండే జంతువులు. ఎన్న‌టికీ క‌ల‌వ‌లేవు. ధృవ‌పు ఎలుగుబంట్లు ఉత్త‌ర ధృవంలో ఉంటాయి. పెంగ్విన్‌లు ద‌క్షిణ ధృవంలో ఉంటాయి.

5. జ‌గ్‌లో పాలు లేవు.

6. ఒంటెల‌కు నీడ‌లు ప‌డ‌డం లేదు.

7. ఇండియాలో లాగే లండ‌న్‌లోనూ లెఫ్ట్ సైట్ డ్రైవింగ్ చేస్తారు. కుడి వైపు కాదు.

8. ఇంట్లోని చిమ్నీ నుంచి వ‌స్తున్న పొగ ఓ వైపు, అటు వైపు ఉన్న చెట్టు గాలికి మ‌రో వైపు ఉన్నాయి.

9. అద్దంలో ప‌డిన యువ‌తి ప్ర‌తిబింబం త‌ప్పు.

10. ట్రాఫిక్ సిగ్న‌ల్‌లో రెడ్ సిగ్న‌ల్ లేదు. ట్రామ్ కార్‌కు డోర్ లేదు. కింద రెయిలింగ్ లేదు. హోర్డింగ్‌లో డిసెంబ‌ర్ 32 అని ఉంది.

 

Comments

comments

Share this post

scroll to top