ఒకవేళ రేపు ఇండియా – పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో “వర్షం” పడితే…ఏం జరుగుతుంది..?

ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు వచ్చింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ – పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఆదివారం తలపడనున్నాయి. గురువారం జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో “బాంగ్లాదేశ్” పై తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయం సాదించింది భారత్. 264 లక్షాన్ని చాలా సునాయాసంగా ఛేదించింది భారత్.

ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందునుండి వర్ష ముప్పు ఉంది. ఎన్నో మ్యాచ్ లలో అంతరాయం కలిగించింది వర్షం. మొన్న జరిగిన ఇండియా – బాంగ్లాదేశ్ సెమి ఫైనల్ కూడా మొదట వర్షం తో స్టార్ట్ అయ్యింది. మరి ఒకవేళ పాకిస్తాన్ తో ఫైనల్ లో వర్షం పడితే. ఏం జరుగుంతుంది?

  • ఛాంపియన్స్ ట్రోఫీ కి రిజర్వు డే ఉంటుంది. ముందుగా చెప్పిన డేట్ రోజున జరగకపోతే ఇంకో రోజు ఆడే వీలు ఉంది.
  • మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండి కంటిన్యూ చేస్తారు రిజర్వు డే రోజున
  • విజేతను నిర్దారించడానికి సరిపడా ఓవర్లు ఆడలేకపోతే సూపర్ ఓవర్ పెడతారు
  • ఒకవేళ రెండు రోజులు వర్షం పడి. సూపర్ ఓవర్ కూడా ఆడే పరిస్థితి లేకుంటే రెండు టీం లను విజేతగా ప్రకటిస్తారు. 2002 లో ఇండియా- శ్రీలంక కప్ షేర్ చేసుకున్నాయి.

Comments

comments

Share this post

scroll to top