రేపు ఇండియా – పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఉండగా…ఇంతలో “స్టార్ స్పోర్ట్స్” ఎలాంటి షాక్ ఇచ్చిందో తెలుసా..?

టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ ఉందంటే సగటు క్రీడాభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. అదే ఫైనల్‌లో ఇరు జట్లు తలపడుతున్నాయంటే ఆ మ్యాచ్‌కు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు రేపు తుది పోరుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ప్రసారమయ్యే స్టార్ స్పోర్ట్స్ చానల్ ప్రకటనల టారిఫ్‌ను అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది.


మామూలు సందర్భాల్లో ఉన్న టారిఫ్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ చార్జీలను యాడ్ కంపెనీలకు విధించినట్లు సమాచారం. 30 సెకన్ల పాటు ప్రసారమయ్యే యాడ్‌కు 10 మిలియన్లు రూపాయాలు అంటే అక్షరాలా కోటి రూపాయల వరకూ వసూలు చేయనున్నట్లు టాక్. మొత్తం మీద ఈ ఫైనల్ మ్యాచ్ క్రీడాభిమానులకు ఎంత వినోదాన్ని పంచుతుందో తెలియదు కానీ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీకి మాత్రం బాగా కలిసొచ్చిందని చర్చ జరుగుతోంది.

Comments

comments

Share this post

scroll to top