ఫైనల్స్ కి ముందు సహనం కోల్పోయి హద్దుమీరి… గంగూలీని రౌండప్ చేసి “పాక్ ఫాన్స్” ఎలా దాడి చేసారో చూడండి!

ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ – పాక్ తలపడనున్నాయి. కానీ ఇంతలో పాకిస్తాన్ అభిమానులు సహనం కోల్పోయారు. ఇంగ్లాండ్ లో మాజీ కెప్టెన్, కామెంట్రేటర్ గంగూలీపై దాడికి దిగారు. ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. కారుపై పాక్ జెండాలు కప్పారు. పాకిస్తాన్ జిందాబాద్.. ఇండియా ముర్దాబాద్ (డౌన్ డౌన్) అంటూ నినాదాలు చేశారు. కారు కదలకుండా నిర్భందించారు. కానీ డ్రైవింగ్ చేస్తున్న గంగూలీ మాత్రం చుట్టుముట్టిన పాక్ అభిమానుల నినాదాలకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు. కారు నుంచి దిగలేదు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యింది. పాక్ అభిమానులను అక్కడి నుంచి పంపించేశారు.

జూన్ 14వ తేదీ పాకిస్తాన్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత సోఫియా గార్డెన్ స్టేడియం బయటకు ఈ ఘటన జరిగింది. ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై దాదా కూడా ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఇప్పుడు రచ్చ రచ్చ అవుతుంది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top