చేతిలో మ్యాంగో పెట్టిన ఫ్లిఫ్ కార్ట్.

ఫిఫ్ల్ కార్ట్ ను నమ్ముకున్న పాపానికి ఓ యువకుడికి  చెవిలో పువ్వు, చేతిలో మ్యాంగో వచ్చిపడ్డాయి.  మాయా లేదు మర్మం లేదు. కేవలం ఫ్లిఫ్ కార్ట్ మోసం , అంతకు మించి  నిర్వాహకుల అజాగ్రత్త. 8099 రూపాయలు చెల్లించి మరీ ఆన్ లైన్ లో మొబైల్ ను బుక్ చేసుకున్నాడు కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన సృచరణ్ . అయిదు రోజుల తర్వాత కొరియర్ బాయ్ వచ్చి ఫ్లిఫ్ కార్డ్ ఫార్సిల్ చేతిలో పెట్టాడు.

FILPCART SEND MANGOES IN PLACE OF MOBILE

దేవుడికి రెండు మొక్కులు మొక్కి పార్సిల్ ఓపెన్ చేసి చూసిన  చరణ్ ఒక్కసారిగా అవ్వాక్కయ్యాడు. మొబైల్ ఉండాల్సిన ఆ పార్సిల్ లో రెండు బంగినపల్లి మామిడి పండ్లు దర్శనమిచ్చాయి. వాటిని చూసి దిమ్మతిరిగిన చరణ్ మొబైల్ ప్లేస్ లో మ్యాంగోస్  పంపారంటూ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేశాడు. వాళ్ల దగ్గరి నుంచి సరైన రెస్పాన్స్‌ అందలేదు.

Flipkart send mangoes instead of mobile

 

దీంతో.. జరిగిన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చాడు బాధితుడు సృచరణ్‌. తనకు న్యాయం జరగకుంటే.. త్వరలో వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తానన్నారు.నచ్చిన మోడల్ కూర్చున్న చోటుకే వస్తుందని ఆన్ లైన్  కొనుగోళ్లకు జనాలు అలవాటుపడుతున్న ఈ సమయంలో ఫ్లిఫ్ కార్ట్ ఇలాంటి షాక్ ఇవ్వడంతో ఆన్ లైన్ల కొనుగోలు పై  నమ్మకాలు సన్నగిల్లితున్నాయి.ఫేక్ రేట్ల ను ముద్రించి ఫ్లిఫ్ కార్ట్ డిస్కౌంట్లను ప్రకటిస్తోందని గతంలోనే ఫ్లిప్ కార్ట్ పై పెద్ద దుమారం రేగింది.

ఫ్లిఫ్ కార్ట్ చేసిన మోసాలు: CLICK

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top