దృశ్యం,మనం సినిమాల మధ్య భీకర పోటి.?

62వ సౌత్ ఇండియా ఫిల్మ్‌ ఫేర్‌అవార్డుల రేసులో భీకర పోటి నెలకొని ఉంది. టైటిల్ వేటలో అయిదు సిినిమాలు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన మనం, దృశ్యం సినిమాలు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. మన టాలీవుడ్ నుండి అయిదు చిత్రాలు  ఫిల్మ్ ఫేర్ కు  నామినేట్ అయ్యాయి. ఇందులో  దృశ్యం, మనం, కార్తికేయ, రేసుగుర్రం, రన్‌రాజా రన్‌. సినిమాలున్నాయి.

 

Venkatesh, Meena in Drishyam Telugu Movie Release Wallpapers

మళయాళం సినిమాకి అధికారిక రిమేక్ దృశ్యం. ఫ్యామిలీ థ్రిల్లర్ నేపధ్యంలో వచ్చి తెలుగు లో మంచి హిట్ ను సాధించింది. వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించారు. కేబుల్ ఆపరేటరుగా పనిచేసే రాంబాబుకి తన భార్య జ్యోతి, కూతుళ్ళు అంజు, అనులే ప్రపంచం. అనుకోకుండా వరుణ్ అనే కుర్రాడు అంజు నగ్నంగా ఉన్నప్పుడు ఒక వీడియో తీసి దాన్ని చూపించి అంజుని, జ్యోతిని బెదిరిస్తాడు. తమని తాము కాపాడుకోవడం కోసం వరుణ్ తలపై మోది గాయపరచాలనుకున్నా అతను చనిపోతాడు. విషయం తెలుసుకున్న రాంబాబు వరుణ్ తల్లి, ఇన్స్పెక్టర్ జనరల్ అయిన గీత ప్రభాకర్ నుంచి, ఇతర పోలీసుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోడానికి చేసిన ప్రయత్నమే సినిమా యొక్క మూల కథ.

బలాలు:

 • బలమైన కథ.
 • కుటుంబం చుట్టూ అల్లుకునే స్కీన్ ప్లే
 • శక్తివంతమైన పాత్రలు.
 • వెంకటేష్, నదియా నటన.
 • అసాంతం ప్యామిలీ థిల్లర్ గా కథన నడిపించిన వైనం.
 • చక్కటి మెసేజ్.

 

manam film fare award

అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన నాగేశ్వరరావు, నాగార్జున,నాగ చైతన్య కలిసి నటించిన అరుదైన చిత్రం. కథలోని మూడు తరాలను నిజజీవితంలోని మూడు జనరేషన్ హీరోలతో చేయించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కథను రివర్స్ లో నడిపించి చూపించాడు దర్శకుడు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా ఘన విజయం సాధించింది ఈ సినిమా, అక్కినేను నాగేశ్వర్రావ్ చివరి సినిమా కూడా ఇదే.

బలాలు:

 • మూడు తరాలను కళ్లకు కట్టినట్టు చూపడం.
 • మ్యూజిక్
 • ఫ్యామిలీ సెంటిమెంట్
 • నాగార్జున శ్రియ ల మధ్య నడిపిన కథ.

 

kartikeya FILMFARE award

సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో సుబ్రమణ్యస్వామి గుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ పాము కాటుకి చనిపోతుంటారు. ఆ గుడికి సంబంధించిన రహస్యం ఏమిటనేది తెలుసుకోవాలని తన ప్రయత్నం మొదలు పెడతాడు ఆ ఊరికి మెడికల్‌ క్యాంప్‌ మీద వచ్చిన వైద్య విద్యార్థి కార్తీక్‌ (నిఖిల్‌). ప్రతి యేటా కార్తీక పౌర్ణమికి వెలుగులు విరజిమ్మే ఆ గుడి వెనుక రహస్యం ఏమిటి? ఒకప్పుడు ఎంతో ఖ్యాతి గడించిన ఆ గుడిని గురించి ఎవరైనా మాట్లాడినా కానీ ఎందుకని చనిపోతున్నారు? అనే రహస్యాలను చేధిస్తాడు కార్తీక్ గా నటించిన నిఖిల్.

బలాలు:

 • చందు డైరక్షన్..
 • సైన్స్ ను నమ్మకాలను బ్యాలెన్స్ చేస్తేూ కథ నడిపించిన తీరు.
 • సినిమా ఆసాతం కొనసాగిన థ్రిల్లింగ్.
 • యూత్ కమ్ ఫ్యామిలీ ని ఆకట్టుకోవడం.

 

race-gurram- FILMFARE AWARD

సురేంధర్ రెడ్డ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రేసుగుర్రం, కలెక్షన్ల వసూల్లలో రేసుగుర్రంలాగే దూసుకెళ్లింది. లక్కీ, రామ్ ఇద్దరూ అన్నదమ్ములు. నీతి, నిజాయితీ ఉన్న బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ రామ్, ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటాడు. రామ్కు తగిన గుణపాఠం చెప్పాలని అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు లక్కీ.. లక్కీ దొంగిలించిన కారులో ఉన్నది రామ్ అనుకుని రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి వర్గం ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడిన లక్కీ(బన్నీ), తన అన్న ను చంపాలనుకున్న రౌడీ వర్తాన్ని నిలువరిస్తాడు.

బలాలు:

 • బ్రహ్మానందం, అలీ కామెడీ
 • అల్లుఅర్జున్ ఎనర్జికి
 • అన్నగా శ్యా.మ్‌ నటన

 

run raja run film fare award

రాజా హరిశ్చంద్రప్రసాద్‌ (శర్వానంద్‌) ప్రేమించిన ప్రతి అమ్మాయి హ్యాండిస్తుంటుంది. చాలా మందిని ప్రేమించి విసిగిపోయిన దశలో అతనికి ప్రియ (సీరత్‌) తారసపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ప్రియ ఆ సిటీ పోలీస్‌ కమీషనర్‌ (సంపత్‌) కూతురు. తన కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత ఆ కమీషనర్‌ రాజాకి కొన్న పరీక్షలు పెడతాడు. ప్టాష్ బ్యాక్ లో హీరోయిన్ తండ్రి, హీరో తండ్రి పోలీస్ ఆఫీసర్స్ గా పని చేస్తారు. ఆ సయమంలో రౌడీలతో చేతులు కలిపి తన తండ్రిని మోసం చేసినమీరెయిన్ తండ్రికి ఫినిషింగ్ టచ్ ఇస్తాడు హీరో. కిడ్నాప్ కథ బ్యాక్ డ్రాప్ గా ‘రన్ రాజా రన్’ను ఓ అందమైన ప్రేమ కథ ముగుస్తుంది.

బలాలు:

 • శర్వానంద్ నటన.
 • ఫిలిం. స్టార్ట్‌ టు ఎండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
 • పన్నీ టచ్ ఉండే క్యారెక్టర్స్.

రేసులో  ఉన్నది 5 చిత్రాలైన ముఖ్యంగా దృశ్యం, మనం ల మధ్యే పోటీ నెలకొని ఉంది.  మరింత లోతుల్లోకెలితే దృశ్యం సినిమాకే ఫిల్మ ఫేర్ అవార్డు దక్కే అవకాశం ఉంది.  4 దక్షిణాది రాష్ట్రాలలోని ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ నటులకు పట్టం కట్టే ఈ వేడుక ఈ నెల 28న చెన్నైలోని నెహ్రు ఇండోర్‌ స్టేడియంలో జరగనుంది. ఆంద్రప్రదేశ్,కర్నాటక,తమిళనాడు,కేరళ నుండి వేరు వేరుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం చేస్తారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top