రాత్రిపూట ఒక గ్లాస్ లో నీటిని నింపి దాన్ని బెడ్ కింద పెట్టుకుని నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

ప్ర‌కృతిలో మ‌న కంటికి క‌నిపించ‌ని శ‌క్తులు అనేకం ఉంటాయి. వాటిల్లో కొన్ని మ‌న‌కు పాజిటివ్ ఎన‌ర్జీని ఇస్తే కొన్ని నెగెటివ్ ఎనర్జీని క‌లిగిస్తాయి. పాజిటివ్ శ‌క్తి వ‌ల్ల మ‌న ఆరోగ్యం బాగుంటుంది. ధ‌నం సంపాదించుకోగ‌లుగుతాం. అదృష్టం మ‌న వెంట ఉంటుంది. ఇక నెగెటివ్ ఎన‌ర్జీ పాజిటివ్ శ‌క్తికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంది. మ‌నకు ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టు ముడ‌తాయి. అంద‌రూ అనారోగ్యాల బారిన ప‌డ‌తారు. స‌మ‌స్య‌ల సుడిగుండాల్లో కొట్టుమిట్టాడుతుంటారు. అయితే ఇది స‌రే.. మ‌రి ఆయా శ‌క్తుల ప్ర‌భావం మ‌న‌పై ఉందా, లేదా అన్న‌ది తెలుసుకోవాలంటే ఏం చేయాలి ? అంటే.. అది ఎలాగో కింద తెలుసుకోండి.

ఒక గ్లాస్‌లో చివ‌రి అంచుక‌న్నా కొంచెం కింద వ‌ర‌కు నీటిని నింపండి. ఆ గ్లాస్‌ను మీరు రాత్రి పూట నిద్ర‌పోయే ముందు మీ బెడ్ కింద ఉంచండి. ఉద‌యాన్నే లేచి ఆ గ్లాస్‌ను గ‌మ‌నించండి. అందులో బుడ‌గ‌లు ఉన్నాయో, లేదో చూడండి. అలాగే గ్లాస్‌లో ఉన్న నీటి ప‌రిమాణం అలాగే ఉందా, పెరిగిందా అన్న‌ది కూడా గ‌మ‌నించండి. ఒక వేళ నీటిలో బుడ‌గ‌లు ఉన్నా, లేదంటే గ్లాస్‌లో నీటి ప‌రిమాణం పెరిగినా మీ చుట్టూ ప్ర‌తికూల శ‌క్తులు (నెగెటివ్ ఎన‌ర్జీ) బాగా ఉన్న‌ట్లే లెక్క‌. అందుక‌నే నీటిలో బుడ‌గ‌లు ఏర్ప‌డుతాయి. నీటి ప‌రిమాణం పెరుగుతుంది.

మ‌రి నెగెటివ్ ఎన‌ర్జీ నుంచి త‌ప్పించుకోవాలంటే ఏం చేయాలి.. అంటే..అందుకు ప్ర‌త్య‌కంగా ఏమీ చేయాల్సిన ప‌నిలేదు. అలా రోజూ నీరు నింపిన గ్లాస్‌ను రాత్రి పూట ప‌డుకోబోయేముందు బెడ్ కింద పెట్టుకుంటే చాలు. దాంతో మీ చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీని ఆ నీరు పీల్చుకుంటుంది. నీటికి నెగెటివ్ ఎన‌ర్జీని అంతం చేసే శ‌క్తి ఉంటుంద‌ట‌. అందుక‌నే అలా జ‌రుగుతుంద‌ట‌. క‌నుక మీకు కూడా నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ క‌ల‌గాలంటే పైన చెప్పిన సింపుల్ టిప్‌ను ఫాలో అయిపొండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top