క్రికెట్ ప్రోఫెషనల్ గేమ్.. అటువంటి ప్రోఫేషనల్ ఆటను కాస్తా WWE గా మార్చారు ఆ ప్లేయర్లు. ఆటను చూడడానికి వచ్చిన ప్రేక్షకుల ముందే ఒక్కరిపై ఒకరు కిక్ బాక్సింగ్ చేసుకున్నారు.. ఈ మొత్తం ఫైటింగ్ కి ఎంపైర్లు మౌన సాక్ష్యులుగా మిలిగారు. ఐలాండ్ లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ లో.. బ్యాట్స్ మన్ కు ఫీల్డింగ్ టీమ్ కు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇది కాస్త చిలికి చిలికి గాలివాన లా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన బ్యాట్స్ మన్ తన బ్యాట్ తో ఒకరిని బలంగా బాదాడు. అదే పనిగా పీల్డింగ్ జట్టు సభ్యుడిని కొట్టే ప్రయత్నం చేశాడు.
ఇంతలో అందరూ ఒక్కటైన ఫీల్డింగ్ టీమ్ జట్టు, మూకుమ్మడిగా బ్యాట్స్ మన్ ను కిందపడేసి కొట్టారు. అందులో ఒకడు బలంగా కాలితో తన్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బెర్ముడా ఆటగాడు జాసన్ అండర్సన్ పై క్రికెట్ నుండి జీవిత కాల నిషేదాన్ని విధించారు.