పెళ్లిలో మటన్ ముక్కల కోసం ఫైటింగ్..గొడవలకు దారితీసిన మటన్.

పెళ్లికి వెళ్లి నూతన వధూవరులు నిండు నూరేళ్ళుగా సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించి, వారు వడ్డించిన భోజనాల గురించి ఇంటికొచ్చి చర్చించుకుంటారు. కానీ  వీళ్ళు అలా కాదండోయ్, అక్కడేదో జరిగిన చిన్న గొడవను పట్టుకొని, వధూవరుల తరపు బంధువులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.  శేరిలింగంపల్లిలోఓ పెళ్ళికి హాజరైన బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదించి భోజనాలకు కూర్చున్నారు. అయితే అందరికీ వడ్డింపు చేస్తుండగా, ఒకతనికి మటన్ తక్కువగా వడ్డించారు. ఆ వ్యక్తి పెళ్లి కొడుక్కి దగ్గర బంధువు. తనకు మటన్ వడ్డింపులో తక్కువ చేశారన్న కోపంతో తనవద్ద అతను  ప్లేట్ ను విసిరికొట్టగా, ఎదురుగా భోజనం చేస్తూ కూర్చున్న వధువు బంధువుపై, పెళ్లి కొడుకు బంధువు విసిరిన ప్లేట్ పడింది. దీంతో ఒక్కసారిగా ఆ పెళ్లికొడుకు, పెళ్లికూతురు బంధువుల మధ్య పెద్ద గొడవ స్టార్ట్ అయింది. మాటామాటా పెరుగుతుండగా పెళ్లి పెద్దలు సర్దిచెప్పడంతో ఆ గొడవను అంతటితో వదిలేశారు.

Athithicatering (1)
అయితే తమకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయిన వధువు బంధువులు మల్లంపేట నుండి శేరిలింగంపల్లిలోని సురభి కాలనీకి వెళ్లి వరుడి బంధువులపై దాడి చేశారు. కాగా ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయలైనట్లు సమాచారం. పెళ్లి కొడుకు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడ్డవారిని అరెస్ట్ చేశారు.

Comments

comments

Share this post

scroll to top