ఫిదాలో భానుమ‌తి కి సిస్ట‌ర్ గా యాక్ట్ చేసింది..T న్యూస్ ఛాన‌ల్ యాంక‌ర్.!!

ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఫిదా ముచ్చ‌ట్లే.! ముఖ్యంగా ఫిదాలోని మూడు క్యారెక్ట‌ర్ల గురించే చ‌ర్చ‌…. ఒక‌టి భానుమ‌తి, రెండు ఆమె అక్క రేణుక‌, మూడు అమెరికా కుర్రాడు( హీరో).

భానుమ‌తి :
అచ్చ తెలంగాణ ఆడ‌పిల్ల‌గా యాక్ట్ చేసిన భానుమ‌తి ( సాయిప‌ల్ల‌వి) ది త‌మిళ‌నాడులోని కోటగిరి. డాన్స్ షోలో పాల్గొంటూ సినిమా రంగం వైపు అనుకోకుండా వ‌చ్చింది. జార్జియాలో డాక్ట‌ర్ కోర్స్ ను కూడా కంప్లీట్ చేసింది. ప్రేమ‌మ్ సినిమాతో మ‌ల‌ర్ గా కేర‌ళ అంద‌రికీ సుప‌రిచిత‌మైన సాయిప‌ల్ల‌వి…ఇప్పుడు భానుమ‌తిగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

రేణుక :
‘ ఫిదా ’ సినిమాలో భానుమ‌తికి అక్కగా నటించిన ‘ శరణ్యా ప్రదీప్ ’ నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్ కు చెందినామె.!లోక‌ల్ TVలో యాంక‌ర్ గా త‌న కెరీర్ ను స్టార్ట్ చేసిన శ‌ర‌ణ్య‌….తర్వాత V6 ‘ తీన్మార్ వార్తలతో ప్రేక్ష‌కుల‌కు చేర‌వైంది. ఇప్పుడు Tన్యూస్ లో వస్తున్న ‘ ధూంధాం వార్తలకు యాంకర్ గా చేస్తోంది. ఈ స‌మ‌యంలోనే….ఫిదా సినిమాకు ఆడిష‌న్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిపోయింది. స్వ‌త‌హాగా నిజామాబాద్ అమ్మాయి కావ‌డం, దానికి తోడు తెలంగాణ యాస వ‌చ్చి ఉండడం..న్యూస్ యాంక‌ర్ గా కెమెరా ప‌రిచ‌యం ఉండ‌డం అన్ని క‌లిసొచ్చాయి.

వ‌రుణ్ తేజ్ :
మెగా కాంపౌండ్ నుండి వ‌చ్చిన రియ‌లిస్టిక్ హీరో వ‌రుణ్..ఫ‌స్ట్ సినిమా నుండి ప్ర‌యోగాల‌కే ప్రాధాన్య‌త ఇస్తూ…మంచి మంచి రోల్స్ ను పోషిస్తున్నాడు. కంచె మొద‌లు ఫిదా వ‌ర‌కు..ఒక్కొక్క సినిమాలో ఒక్కోక్క వైవిద్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నాడు. ఫిదాలో భానుమ‌తితో పోటీ ప‌డి న‌టించి వావ్ అనిపించాడు.

Comments

comments

Share this post

scroll to top