హిందీలో రీమేక్ అవ్వబోతున్న “ఫిదా”..! భానుమతిగా చేసే హీరోయిన్ ఎవరో తెలుసా..?

భానుమతి..రెండు కులాలు,రెండు మతాలు …ఒకటే పీస్ హైబ్రీడ్ పిల్లా….. గుర్తుంది కదా…బద్మాష్ బలిసిందారా అని తిట్టినా కూడా ఆ తిట్లు ప్రేక్షకులను అలరించాయి..ఫిదా ప్రతి ఫ్రేమ్ లోనూ తనదైన ముద్ర వేసి భానుమతి క్యారెక్టర్ లో ఆకట్టుకుంది సాయి పల్లవి. కమ్మని తెలంగాణ మాటలకు తన సహజమైన గాత్రంతో ప్రాణం పోసింది. అందమైన హావభావాలతో ఆన్‌స్క్రీన్ మీద అద్దరగొట్టి పోరగాళ్ల బొక్కలు ఇరగ్గొట్టింది.అందరిని బాన్సువాడ భానుమతికి ఫిదా అయ్యేలా చేసింది… అదంతా డైరెక్టర్ శేఖర్ కమ్ముల భానుమతి క్యారెక్టర్ ని రాసుకున్న విధానమే..  ఇప్పుడు ఫిదా సినిమా బాలివుడ్ లోకి రీమేక్ అవ్వబోతుంది..మరి అక్కడ భానుమతిలా మాయచేయబోతుంది ఎవరో తెలుసుకోవాలనుందా…

ఎప్పటినుండో హిందీలో సినిమా తీయాలని శేఖర్ కమ్ముల కోరిక, హ్యాపీ డేస్ ని రీమేక్ చేద్దాము అనుకున్నాడు కానీ జరగలేదు, అయితే ఇప్పుడు ఈ సినిమాతో మంచి అవకాశమే వచ్చింది, హిందీ లో పంజాబీ బ్యాక్ డ్రాప్లో  ఈ సినిమా ఉండబోతోందంట. అయితే మరి భానుమతి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో తెలుసా.. ఉడ్తా పంజాబ్ సినిమాలో పంజాబీ పిల్ల గా అందర్నీ తన యాక్టింగ్ తో ఆకట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ ఈ పాత్రను పోషించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆలియా అల్లరి పిల్లగా అందరిని ఆకట్టుకుంది..మరీ భానుమతి మరిపించేలా యాక్ట్ చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..అన్ని సెట్ అయితే హిందీలో కూడా దిల్ రాజే ఈ సినిమాని నిర్మిస్తారట…

ఇక్కడ మీకొక డౌట్ రావొచ్చు హిందీలో కూడా సాయిపల్లవే చేయొచ్చు కదా అని .. మళయాలంలో వచ్చిన ప్రేమమ్ లో మలర్ గా అందరి హృదయాల్లో స్థానం సంపాదించిన ఆ క్యారెక్టర్ ని తెలుగులో శృతి హాసన్ చేసిన విషయం మనకు తెలిసింది.కానీ రీమేక్స్ లో నటించనని పల్లవి ఎప్పుడో చెప్పేసింది.. అలా కాకుంటే ప్రేమమ్ రీమేక్ లోనే మనం సాయిపల్లవిని చూసేవాళ్లం..

Comments

comments

Share this post

scroll to top