“ఫిదా” సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ “ఆర్యన్” గురించి ఈ విషయాలు తెలుసా..? అతని తల్లితండ్రులు ఎవరంటే!

శేఖర్ కమ్ముల సినిమా అనగానే ప్రతి క్యారెక్టర్ కి ఎంతో  ప్రత్యేకత ఉంటుంది.కథానాయికా నాయకుల పాత్రల కోసం ఎంత శ్రద్ద తీసుకుంటారో మిగతా క్యారెక్టర్స్ విషయంలో కూడా అంతే శ్రద్ద తీసుకుంటారు.అందుకే సినిమా చూసి బయటికి వచ్చాక హీరో హీరోయిన్ మాత్రమే కాదు ప్రతి క్యారెక్టర్ మనకు గుర్తుండిపోతారు.మొన్న వచ్చిన ఫిదా మూవీనే తీసుకుంటే సాయిపల్లవి,వరుణ్ తేజ్ మాత్రమే కాదు ఫాదర్ క్యారెక్టర్ సాయిచంద్,అక్కగా శరణ్య,రాజా ప్రతి క్యారెక్టర్ మనకు గుర్తున్నవే..బుజ్జీ గుర్తున్నాడా..అదేనండీ స్కూల్ కి వెళ్లనని మారాం చేసి,టాయిలెట్ పేపర్ కావాలని అల్లరి చేసిన వరుణ్ తేజ్ తమ్ముడు బుజ్జీ… బుజ్జీ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

బుజ్జీ అసలు పేరు ఆర్యన్.. ఫిదాలో అవకాశం ఆర్యన్ కి ఆషామాషీగా రాలేదు తెలుసా..ఎన్నో ఆడిషన్స్ చేసాక ఫైనల్ గా ఆర్యన్ ని సెలక్ట్ చేశారు శేఖర్ కమ్ముల..ఫిదా లో నటించడానికన్నా ముందే ఆర్యన్ బోలెడన్ని డబ్ స్మాష్ లు,యూ ట్యూబ్ వీడియోలు  చేశాడు.బుజ్జీకి  సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది దాని పేరే  “The Oreo Man”,..ఫిదాలో బుజ్జీ క్యారెక్టర్ కోసం అమెరికాలోనే పుట్టి పెరిగిన పిల్లల్ని ఆడిషన్ తీసుకున్నారు డైరెక్టర్.అమెరికాలో నే పుట్టిపెరిగాడు అంటే మనకేం సంభందంలేదు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే..ఆర్యన్ మన తెలుగువాడే..ఇంకా చెప్పాలంటే తెలంగాణావాడే..

ఆర్యన్ వాళ్ల నాన్న చందు,అమ్మ వీణలది అమెరికాలో ఫ్లోరిడా లో స్థిరపడిన మన తెలుగు కుటుంబం.ఆర్యన్ వాళ్ల నాన్న చందుది నిజమాబాద్ జిల్లా,అమ్మ వీణది హైదరాబాద్..ఆర్యన్ కి ఒక అన్న కూడా ఉన్నాడు. సినిమా షూటింగ్ గురించే అనే కాదు సెలవులకు అమ్మమ్మ ఊరైనా హైదరాబాద్ కి ఆర్యన్ ప్రతి సమ్మర్లో వస్తుంటాడు.ఇక్కడినుండి వెళ్లి అక్కడ స్థిరపడి ఇప్పుడు ఇక్కడ ఇంత పేరు సంపాదించుకున్న ఆర్యన్ వయసెంతనుకుంటున్నారు ఎనిమిదేళ్లు..ఈ బుడతడు మరిన్ని సినిమా అవకాశాలు రావాలని తాను కోరుకున్న రంగంలో మంచిగా స్థిరపడాలని కోరుకుందాం.

watch video here:

Comments

comments

Share this post

scroll to top