విద్యార్థుల‌కు అశ్లీల చిత్రాల‌ను చూపిస్తూ వారి ముందు అర్థ‌న‌గ్న డ్యాన్సులు చేసింది ఆ టీచ‌ర్..!

పాఠ‌శాల‌లంటే విద్యార్థుల‌కు నిజంగా దేవాల‌యాల‌తో స‌మానం. ఎందుకంటే ఎంతో విలువైన విద్య‌ను అక్క‌డ బోధిస్తారు కాబ‌ట్టి. ఈ క్ర‌మంలో గురువులంటే దైవంతో స‌మానంగా చూస్తారు. అందులో భాగంగానే గురువు చూపిన బాట‌లో విద్యార్థులు న‌డిచి ఉన్న‌త‌ ల‌క్ష్యాల‌ను సాధించి గొప్ప‌ స్థానాల‌ను చేరుకుంటారు. అయితే ఆ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయురాలు మాత్రం అలా కాదు. అస‌లు ప్ర‌పంచంలో ఎక్క‌డా ఏ గురువు చేయ‌లేని, చేయ‌రాన‌టువంటి అస‌భ్య‌క‌ర‌మైన ప‌నులు చేసింది. అత్యంత జుగుప్స‌ను క‌లిగించే ఈ సంఘ‌ట‌న జ‌రిగింది గుజ‌రాత్‌లో..!

గుజ‌రాత్‌లోని పోరు బందర్‌లో ఉండే శార‌దా విద్యామందిర్‌లో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థుల‌కు విద్య‌ను బోధిస్తోంది. అయితే ఆమె మ‌న‌స్సులో ఏం పురుగు తొలిచిందో ఏమో గానీ… ఏ గురువు చేయ‌కూడ‌ని ప‌ని చేసింది. త‌న స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అశ్లీల చిత్రాల‌ను విద్యార్థుల‌కు చూపించ‌డ‌మే కాదు, కొంత మంది విద్యార్థుల‌ను ఓ గ‌దిలోకి ప్ర‌త్యేకంగా తీసుకెళ్లి వారి ఎదుట అర్థ‌న‌గ్నంగా డ్యాన్సులు చేయ‌డం ప్రారంభించింది. దీంతో ఆ విద్యార్థుల‌కు ఏం చేయాలో అర్థం కాలేదు.

అయితే తాను అలా ప్ర‌వర్తిస్తున్న విష‌యం గురించి ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని ఆ ఉపాధ్యాయురాలు విద్యార్థుల‌ను బెదిరించింది. దీంతో ఎవ‌రూ ఆమె అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌, చేష్ట‌ల గురించి ఎవరికీ చెప్ప‌లేదు. అయితే ఈ మ‌ధ్యే ఓ విద్యార్థి ధైర్యం చేసి ఆ విష‌యాన్ని త‌మ ఇంట్లో చెప్పాడు. దీంతో ఆ ఉపాధ్యాయురాలు గుట్టు బ‌య‌ట ప‌డింది. విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు అంద‌రికీ విష‌యం తెలియ‌డంతో వారు పాఠ‌శాల‌కు చేరుకుని పెద్ద ఎత్తున గొడ‌వకు దిగారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యం గుజరాత్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అయితే త‌ల్లిదండ్రుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు ఆ పాఠ‌శాల‌కు చేరుకుని స‌ద‌రు ఉపాధ్యాయురాలిని అరెస్టు చేశారు. ఆమెపై 293, 294 సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని అందులో చూడ‌గా కొన్ని వంద‌ల కొద్దీ అశ్లీల చిత్రాలు అందులో ఉన్న‌ట్టు గుర్తించారు. చూశారుగా..! ఆ ఉపాధ్యాయురాలి తీరు..! మ‌న పిల్ల‌ల‌కు చ‌దువు బోధిస్తార‌ని వారిని గురువుల వ‌ద్ద‌కు న‌మ్మ‌కంగా పంపుతుంటే కొంద‌రేమో ఇలా చేస్తున్నారు. కాబ‌ట్టి త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top