ఫీల్ ది జైల్ …కాన్సెప్ట్ గురించి విన్నారా???రూ.500 కు ఒక్క రోజు ఖైదీగా ఉండే జైల్ టూరిజం గురించి తెలుసుకోండి.

ఆర్యా సినిమాలో ఫీల్ మై లవ్ అంటూ… అల్లు అర్జున్ ,గీత వెంట పడిన కాన్సెప్ట్ తెలుసు కానీ..ఈ ఫీల్ మై జెయిల్ కాన్సెప్ట్ ఏంటండీ అనుకుంటున్నారా…జనరల్ గా మనం జెయిల్ కు ఎప్పుడు వెళ్తాం ..ఏదన్నా తప్పు చేసినప్పుడు కదా..కానీ ఐదువందల రూపాయలతో జైల్లో ఖైదీగా ఉండే అవకాశం కల్పించడమే ఫీల్ మై జెైల్ కాన్సెప్ట్ ఉద్దేశం .వినడానికి వింతగా ఉన్నా ..ఇలాంటి వింతలు కోరుకునేవారు కూడా ఉంటారు కదా.ఇంతకీ ఇదేక్కడో తెలుసుకోండి..

సంగారెడ్డి పాతజైలు చాలా పురాతనమైంది. చంచల్ గూడ, రాజమండ్రి, వరంగల్ సెంట్రల్ జైళ్ల కంటే పాతది. 1796లో అప్పటి రాజులు తమ గుర్రాలను కట్టేయడం కోసం దీన్ని కట్టారు.తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న వారిని శిక్షించేందుకు జైలుగా వాడారు. స్వాతంత్య్రం అనంతరం 1977లో ఈ భవనాన్ని జైళ్లశాఖకు బదలాయించారు. అప్పటినుంచి సంగారెడ్డి జిల్లా జైలుగా మారిపోయింది.  రోజురోజుకు నేరస్తుల సంఖ్య పెరగడం.. జైళ్ల శాఖలో సంస్కరణలు అమల్లోకి రావడం..పైగా రెండు శతాబ్దాల క్రితం నాటి కట్టడం తదితర కారణాల వల్ల జిల్లా జైలును కొత్త బిల్డింగులోకి తరలించారు.

కొత్త బిల్డింగ్ కు మారిన తర్వాత ఈ పాత జిల్లా జైలు శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో చరిత్ర కలిగిన సంగారెడ్డి పాతజైలు ఇలా అనాథగా మారిపోవడం జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ బాధకలిగించింది. చారిత్రక కట్టడమైనఈ భవనం శిధిలావస్ధకు చేరకుండా భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా చేయాలన్న ఉద్దేశంతో …జైళ్ల శాఖ సంస్కరణలో భాగంగా మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పుడు దేశంలోనే ఎక్కడలేని విధంగా ఫీల్ ద జైల్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 500 రూపాయలు చెల్లిస్తే చాలు.. ఒకరోజంతా జైలు జీవితం ఎలా వుంటుందో తెలుసుకోవచ్చు. వాళ్లను 24 గంటలపాటు ఒక ఖైదీగానే ట్రీట్ చేస్తారు.ఖైదీల మ్యానువల్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఫీల్ ద జైల్ కోసం వచ్చిన వారికి ఉంటాయి. ఖైదీలకు ఎలాంటి భోజనం పెడతారో అచ్చంగా అదే తరహ తిండి పెడతారు. ఖైదీలు ఏలాంటి టైంటేబుల్ ఫాలో అవుతారో, వాళ్లూ అదే ఫాలో కావాలి.లాకప్ కేటాయిస్తారు. పూర్తిగా ఖైదీల తరహలోనే వేషధారణ ఉంటుంది. అంటే ఖాదీ నిక్కర్, ఖాదీ షర్టు, ప్లేటు, గ్లాసు, ముగ్గు, దుప్పటి. సూర్యోదయానికి ముందే ఖైదీ జీవితం మొదలవుతుంది.

ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో లాక్ ఓపెన్ చేయరు. అర్జెంట్ అయితే బ్యారక్ లోపలే టాయిలెట్స్ ఉంటాయి. అవి వాడుకోవాలి. ఒకరోజు ఖైదీ అనుభవం కోసం వచ్చిన వాళ్లు మొబైల్ తీసుకురావొద్దు. ఒకసారి లోపలకి ఎంటరై ఖైదీగా మారితే 24 గంటల పాటు తప్పకుండా ఉండి తీర్సాల్సిందే. మధ్యలో తూచ్ అంటానంటే కుదరదు. ఒకరోజు ఖైదీగా గడపడానికి వచ్చిన వారు.. సాధారణ ఖైదీల్లాగే ఎవరి పనులు వారే చేసుకోవాలి. బారక్ శుభ్రం చేసుకోవాలి. ప్లేట్లు, గ్లాసులు కడుక్కోవాలి.

ఫీల్ ది జైల్ పేరుతో జైళ్ల శాఖ దేశంలోనే తొలిసారిగా తీసుకువచ్చిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఒక్క రోజు ఖైదీగా మారడానికి సిద్ధంగా ఉన్నవాళ్లందరికి స్వాగతం చెబుతున్నారు సంగారెడ్డి పాతజైలు అధికారులు. సో, మీలో ఎవరికైనా ఇంట్రస్ట్ ఉంటే ఒకరోజు ఖైదీగా ట్రై చేయండి.

Comments

comments

Share this post

scroll to top