ఫిబ్రవరి నెల అంటేనే భయపడుతున్న లవర్స్, టూ అనిపిస్తున్న బజరంగ్ దళ్…!!

ఫిబ్రవరి నెల అంటేనే అందరికి గుర్తు వచ్చేది వాలెంటైన్స్ డే నే, ఫిబ్రవరి 14 అంటే లవర్స్ కి ఎంతో ఇష్టం, ప్రేమికుల రోజున ప్రేమికులు చేసే హంగామా అంతా ఇంతా కాదు, కానీ ప్రేమికుల రోజు ప్రేమికులు కాకుండా ఇంకొకరు కూడా హంగామా చేస్తారు. వారే బజరంగ్ దళ్ వాళ్ళు.

బాబోయ్ బజరంగ్ దళ్..!!

ప్రేమ అనే పరీక్షా రాసి, వేచి ఉన్న విద్యార్థిని అనే పాట పాడే వాళ్ళు అబ్బాయిలు ఒకప్పుడు, కానీ ప్రేమికుల రోజున ఆ ప్రేమ పరీక్ష రాయాలంటేనే బయపడుతున్నారు, అందుకు కారణం బజరంగ్ దళ్. దొరికితే కుమ్ముడు, పెళ్లి, పరుగు.. ఒకటా రెండా, బజరంగ్ దళ్ అంటే సామాన్యులకు సంతోషం, ప్రేమికులకు దుఃఖం.

అన్న అన్న వద్దన్నా, నా చెల్లెలు అన్న.. :

ఆ రోజు బజరంగ్ దళ్ చేతికి దొరికితే అంతే కత, అన్న అన్న వద్దు అన్న అని మొరపెట్టుకుంటారు కొందరు, మరికొందరు అన్న తను నా చెల్లెలు అన్న, మా అన్న అన్న తిను అని ఏవేవో సాకులు చెబుతుంటారు, కానీ చివరికి బజరంగ్ దళ్ చేతిలో బుక్కవుతారు ఏదో ఒక రకంగా.

పోలీసులు ఉన్నా.. :

పోలీసులు మాత్రం ఫిబ్రవరి 14 వ తారీఖున ఎవరైనా బజరంగ్ దళ్ వాళ్ళు అల్లర్లు సృష్టిస్తే వారిని అరెస్ట్ చేస్తాం అని తెలిపారు, పట్టణాల్లో బజరంగ్ దళ్ ప్రభావం ఎక్కువగా ఉండదు, కానీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి సిటీ లలో బజరంగ్ దళ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పార్క్ లలో.

ఫిబ్రవరి 14 న సింగల్ లకు పండగే.. :

అయితే ప్రేమ భగ్నం అయిన వాళ్ళు, అసలు ప్రేమ దక్కని వాళ్ళు వాళ్ళ కసి అంత బజరంగ్ దళ్ తో కలిసి తీర్చుకుంటారు ప్రేమికుల పైన, ఒక రకంగా చెప్పాలంటే సింగిల్స్ చాలా మంది ఫిబ్రవరి 14 కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఫిబ్రవరి 14 న ఎన్ని సంఘటనలు జరుగుతాయో చూడాలి.

హింసాత్మకంగా వద్దు.. :

అయితే ఉత్తరాదిన బజరంగ్ దళ్ ప్రేమికుల రోజు ప్రేమికులను కొట్టేది, ఎక్కడ పడితే అక్కడ బాదడం లాంటివి చేస్తుంటారు, ఇలా హింస కార్యక్రమాలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు, ఫారిన్ సంప్రదాయం అయిన వాలెంటైన్స్ డే ని మన దేశం లో జరుపుకోకూడదు అనేదె మా ముఖ్య ఉద్దేశం అని కొందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top