వేరే మతం అబ్బాయి ని ప్రేమించిందని కన్నకూతురినే హత్య చెయ్యడానికి ప్రయత్నించిన తండ్రి. నెల్లూరు లో దారుణం

రాను రాను ప్రేమికుల పైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. వారి పైన దాడి చేసేది వేరే ఎవరో కాదు, వారిని కన్న తల్లి తండ్రులే. ఇటీవలే నిర్మల్ లో కూతురు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని తల్లి తండ్రులు ఆ అమ్మాయి ని దారుణంగా చంపేశారు, ఆ ఘటన మరువక ముందే మరో సంఘటన జరిగింది.

నెల్లూరు జిల్లాలోని గూడూరుకు చెందిన దేవయాని గూడూరులో ఉండే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. జావేద్ అనే యువకుడితో దేవయాని కి పరిచయం ఏర్పడింది, క్రమంగా వీరి పరిచయం ప్రేమ కు దారి తీసింది, వీరు ఇరువురు ప్రేమించుకుంటున్న విషయం దేవయాని ఇంట్లో తెలిసింది. కోపం తో రగిలిపోయిన దేవయాని తండ్రి ఎస్ రాయల్ సెంటర్ ప్రాంతంలో కత్తితో కుమార్తెపై దాడిచేసాడు. ఒక సారి దాడి చేసిన వెంటనే చుట్టు పక్కల ఉన్న జనం అతన్ని అడ్డుకున్నారు. ఆ తరువాత అతను మరొకసారి దాడి చెయ్యలేకపోయాడు, పోలీసులని గమనించిన అతను అక్కడినుండి పరారయ్యాడు. పోలీసుల సాయం తో అక్కడున్న జనాలు దేవయాని ని హాస్పిటల్ కు తరలించారు, దేవయాని తలకు తీవ్రంగా గాయం అయ్యింది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది, ఆమె పరిస్థితి ప్రస్తుతానికి అయితే విషమంగా ఉందని అంటున్నారు హాస్పిటల్ డాక్టర్స్.

వేరే మతం వారిని ప్రేమిస్తే ప్రాణం తీసేస్తారా.?

ప్రాణం పోసి, పెంచిన చేతులు మతం, కులం పేరు మీద వేరే వారిని ప్రేమిస్తే ఎందుకు చంపుతారు అని ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న ప్రశ్న. వేరే కులం వారిని చేసుకోకూడదు, వేరే మతం వారిని చేసుకోకూడదు, ఇవన్నీ డబ్బు లేని వాళ్లకు మాత్రమే వర్తిస్తాయి. బాగా డబ్బు పేరు ఉన్న క్రికెటర్ లు, సినిమా ఆర్టిస్ట్ లు వారికి నచ్చిన వారిని చేసుకుంటారు, ఎక్కువ శాతం వారు పెళ్లి చేసుకొనే వారు వారి మతం వాళ్లు అయి ఉండరు. అయినా కానీ వాళ్ళకి ఎవ్వరు అడ్డు చెప్పారు, కానీ ఏమి లేని వాళ్లే కులం మతం అని అలోచించి పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. ఒక్క రోజు లో ఎవ్వరు ధనవంతులు అవ్వలేరు, మీ కూతురు / కొడుకు ప్రేమించిన వ్యక్తులు మంచి వారైనా చెడ్డ వారైనా ఏదో ఒక రోజు వారిలో మార్పు వచ్చి వారి జీవితం లో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది, అప్పుడు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మీ అల్లుడు / కోడలు గురించి. ప్రేమిస్తే నచ్చచెప్పండి, వినకపోతే వదిలెయ్యండి, వారి ప్రేమ లో తప్పు ఉంటె అండగా ఉండండి, నిజాయితీ గల ప్రేమ అయితే సాయం చెయ్యండి. అంతేకాని ప్రాణాలు మాత్రం తియ్యకండి.

Comments

comments

Share this post

scroll to top