త‌ప్పు చేసిన సొంత కొడుకుని….గాలించి మ‌రీ ప‌ట్టుకొని, పోలీసుల‌కు అప్ప‌జెప్పిన S.I.

బ‌డాబాబులు, రాజ‌కీయ నాయ‌కులు, వీఐపీల పిల్ల‌లు ఏదైనా త‌ప్పు లేదా నేరం చేసి అందులో ఇరుక్కుపోతే… త‌మ త‌మ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఏ విధంగా బ‌య‌ట‌కు వ‌స్తారో, కేసుల నుంచి ఎలా త‌ప్పించుకుంటారో అంద‌రికీ తెలిసిందే. ఇది మ‌న దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా జ‌రుగుతూనే ఉంటుంది. ఈ క్ర‌మంలో ఏ బ‌డా బాబు కూడా చ‌ట్టానికి అనుగుణంగా ప్ర‌వ‌ర్తించ‌రు. అందుకు విరుద్ధంగానే త‌మ వారిని కేసుల నుంచి త‌ప్పిస్తారు. అయితే ఢిల్లీలో ఉండే ఆ పోలీసు అధికారి మాత్రం అలా కాదు. స్వ‌యంగా త‌న కొడుకు ఓ హ‌త్య చేసినా, చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే, ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌ని చెబుతూ, త‌న కొడుకును పోలీసుల‌కు ప‌ట్టిచ్చాడు. అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకున్నాడు.

delhi-police

అత‌ని పేరు రాజ్ సింగ్‌. ఢిల్లీ పోలీసు విభాగంలో ఏఎస్ఐ (అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌)గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. అత‌ని కొడుకు పేరు అమిత్‌. వ‌య‌స్సు 25 సంవ‌త్స‌రాలు. అయితే అమిత్ స్థానికంగా న‌జ‌ఫ్‌గ‌డ్ అనే ఓ ప్రాంతానికి చెందిన యువ‌తిని ప్రేమించాడు. కానీ ఆ యువ‌తికి అత‌ను న‌చ్చ‌లేదు. ఫ‌లితంగా ఆమె ఇంకో యువ‌కున్ని పెళ్లి చేసుకుంది. అయినా అమిత్ వ‌ద‌ల్లేదు. నిత్యం ఆ యువ‌తిని వేధించ‌డం మొద‌లు పెట్టాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని కోర‌సాగాడు. దీనికి ఆ యువ‌తి చీత్కారం కొట్టింది. ఈ క్ర‌మంలో అమిత్ ఎలాగైనా ఆ యువ‌తిని చంపాల‌నుకున్నాడు. అందుకు త‌గ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు.

ఇటీవ‌లే అమిత్ త‌న స్నేహితుడితో క‌లిసి ఆ యువ‌తి ఉంటున్న ప్రాంతం వ‌ద్దకు వెళ్లి, ఆమెపై అటాక్ చేశాడు. వెంట తెచ్చుకున్న క‌త్తితో ఆమెను పొడిచి పొడిచి చంపాడు. దీంతో ఆ యువ‌తి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దిలింది. అయితే హ‌త్య చేసింది త‌న కొడుకు అని తెలియ‌డంతో రాజ్ సింగ్ అంద‌రు బ‌డాబాబుల్లా కొడుకును కేసు నుంచి త‌ప్పించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. పైగా తానే స్వ‌యంగా రంగంలోకి దిగి అమిత్ కోసం గాలించాడు. ఈ క్ర‌మంలో రాజ్ సింగ్ త‌న డిపార్ట్‌మెంట్‌లోని ఇత‌ర పోలీసు అధికారుల‌కు కూడా స‌హ‌క‌రించాడు. దీంతో అమిత్ ఎట్ట‌కేల‌కు తండ్రికి చిక్కాడు. అలా దొరికిన కొడుకును తండ్రి రాజ్ సింగ్ స్వ‌యంగా పోలీసుల‌కు అప్ప‌గించాడు. ఈ క్ర‌మంలో పోలీసు విభాగంలోని ఉన్న‌తాధికారుల‌తోనే కాదు, ఇరుగు పొరుగు వారితోనూ రాజ్ సింగ్ భేష్ అనిపించుకున్నాడు. వారి ప్ర‌శంసలు కూడా పొందాడు. నిజ‌మే మ‌రి…! నేటి త‌రుణంలో అలా చ‌ట్టాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా న‌డుచుకునే బ‌డాబాబులు ఎవ‌రుంటారు చెప్పండి..! ఏది ఏమైనా రాజ్ సింగ్‌ను మాత్రం ఈ విష‌యంలో క‌చ్చితంగా అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top