ఉపవాసం ఉండడం మంచిదేనా? పాస్టింగ్ వల్ల కలిగే లాభాలేంటి?

రంజాన్ మాసం వచ్చేసింది. ముస్లీం సోదరులంతా భక్తిశ్రద్దలతో ఈ పవిత్రమాసానా….నెల రోజుల పాటు కఠిన  ఉపవాస దీక్షలను చేపడతారు. హిందూ సోదరులు కూడా వారంలో ఒకరోజును దేవుడి కొరకు అర్పిస్తూనో.. శివరాత్రి రోజో ఉపవాసదీక్షలు చేపడతారు.. అయితే నిజంగా ఇలా ఉపవాసాలు ఉండడం మంచిదేనా? అంటే, మంచిదే అని సైన్స్ చెబుతోంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాస అనేది సంస్కృత పదం. ఉప అంటే దగ్గర అని, వాస అంటే ఉండడం అని అర్థం. వెరసి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఒకప్పుడు ప్రజలు ఆహారాన్ని సంపాదించడం, దాన్ని వండుకోవడం, తినడం, జీర్ణం చేసుకోవడం వంటి అంశాల పట్ల ఎక్కువగా దృష్టి సారించేవారు. ఈ నేపథ్యంలోనే వారు శారీరకంగా అలసిపోవడంతోపాటు మానసిక ఏకాగ్రత ఉండేది కాదు. దీన్ని అధిగమించేందుకే వారు తక్కువ మొత్తంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం లేదా అసలు ఆహారానికే దూరంగా ఉండడమో చేసే వారు. దీంతో శరీరం తేలిగ్గా అనిపించి మనసు కూడా ప్రశాంతమయ్యేది. దేవుడికి పూజలు, ప్రార్థనలు చేసేందుకు ఇది వారికి ఎంతగానో ఉపయోగపడేది.
ఆహారం తినకుండా అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. దీంతోపాటు శరీరంలోని ఇతర అవయవాలు కూడా మెరుగ్గా పనిచేసేందుకు వీలవుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.ఉపవాసంపై భగవద్గీతలో కూడా పలు అంశాలు పేర్కొనబడ్డాయి. ఉపవాసం అనేది ఒక వ్యక్తి పూర్తి ఇష్టంతోనే ఉండాలని, ఎవరూ ఈ విషయంలో బలవంతం చేయవద్దని గీత సారాంశం. అంతేకాదు శరీరం మరీ నీరసించి అనారోగ్యం కలిగేంతలా కూడా ఉపవాసం చేయకూడదు. ఉపవాసంలో ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి.
అందుకే పెద్దల లంకణం పరమౌషదం అంటారు.
_76456765_76456763
 
రోజా( ఉపవాసం)  విషయంలో కొన్ని సూచనలు:
  • ఎండలు మండిపోతున్న ఈ తరుణంలో మద్యాహ్నం సమయంలో ఎండలకు దూరంగా ఉండాలి.
  • శరీరానికి అవసరమయ్యే పోషకాల గురించి తెలుసుకోని తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఉపవాసం విడవగానే..తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను తీసుకోవాలి.
  • మసాలాలు, నాన్-వెజ్ లను ఎక్కువగా తీసుకోకూడదు.
  • పండ్లను అధిక స్థాయిలో తీసుకోవాలి.
  • బిపీ, షుగర్ లాంటి వ్యాధులన్న వారు డాక్టర్లను సంప్రదించి వారి అనుమతి తో రోజాను పాటిస్తే మంచిది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top