సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది..? ఆ బూతు సీన్లు ఏంటి..? ఆ డైలాగ్స్ ఏంటి..?

ఒకప్పుడు అశ్లీలత అనేది ఇంగ్లీష్ సినిమాలలోనే ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల్లోకి కూడా పాకేసింది. ఇటీవలే ఎన్నో వివాదాల నడుమ విడుదలైన “బాబు బాగా బిజీ” సినిమా దీనికి నిదర్శనం. శ్రీనివాస్ అవసరాల ఇలాంటి సినిమా చేస్తాడు అని ఎవరు అనుకోని ఉండరు. సెన్సార్ కోసం ముంబై దాకా వెళ్లొచ్చిన సినిమా అది. ఇప్పుడు అదే కోవలో “సుమంత్ అశ్విన్” సినిమా కూడా చేరిపోయింది.

సుమంత్ అశ్విన్ ఇప్పటివరకు నటించని ఓ వింత పాత్రలో నటించనున్నాడు. వంశీ దర్శకత్వంలో “రాజేంద్ర ప్రసాద్” నటించిన సూపర్ హిట్ చిత్రం “లేడీస్ టైలర్”. ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు “వంశీ” “ఫాషన్ డిసైనర్ – సన్ అఫ్ లేడీస్ టైలర్” అని సినిమా తీస్తున్నాడు. పోస్టర్ తోనే వివాదంలో ఇరుక్కుంది ఈ సినిమా. ఇటీవల విడుదలైన ట్రైలర్ అయితే మరింత శృతి మించింది. సన్నివేశాలు, డైలాగ్స్ అయితే సెన్సార్ కట్ చేయాలి అనే రేంజ్ లో ఉన్నాయి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top