వెనుక నుంచి గ్యాస్ బాగా వ‌స్తుందా..? అయితే అలా వ‌స్తే మంచిదేన‌ట‌..! ఎందుకో తెలుసా..?

ఏదైనా తిన్నా, తాగినా మ‌న‌కు వెంట‌నే వ‌చ్చేవి ఏంటి..? అవేనండీ త్రేన్పులు. అయితే అవే కాదు, వాటితో మ‌రొక‌టి కూడా విడుద‌ల‌వుతుంది. ఆ… అదే… గ్యాస్‌. అంటే అది, వెనుక నుంచి వ‌స్తుంది లెండి. ఇప్పుడ‌ర్థ‌మైంది క‌దా మేం చెబుతున్న గ్యాస్ ఏంటో. దీన్ని నాటు భాష‌లో మ‌రోలా అంటారు లెండి. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయేది కూడా దాని గురించే. అస‌లు ఇంత‌కీ మ‌న‌కు వెనుక నుంచి గ్యాస్ ఎందుకు వ‌స్తుంది..? మీకు తెలుసా..? ఆ… ఎందుకేంటీ..! బాగా తిన్న‌ప్పుడు లేదా తాగిన‌ప్పుడు, తిన్న‌ది జీర్ణం కాన‌ప్పుడు, ఇలా ప‌లు సంద‌ర్భాల్లో మ‌న‌కు  గ్యాస్ రిలీజ‌వుతుంది. అయితే దీన్ని చాలా మంది అనారోగ్యానికి సూచ‌న అని భావిస్తార‌ట‌. కానీ, అలా వెనుక నుంచి గ్యాస్ రావ‌డం మంచిదేన‌ట‌.

farting

సాధార‌ణంగా అసిడిటీ వ‌ల్ల వ‌చ్చే గ్యాస్ అయితే త‌గ్గిపోతుంది కానీ, పైన చెప్పిన విధంగా స‌హ‌జంగా వ‌చ్చే గ్యాస్ గురించి మ‌నం ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ట‌. ఎందుకంటే అలా వెనుక నుంచి గ్యాస్ రావ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మంచే జ‌రుగుతుంద‌ట‌. అయితే బాగా ఘాటైన వాస‌న‌తో ఎక్కువ సార్లు గ్యాస్ వ‌స్తుంటే దాన్ని అనారోగ్యానికి సూచ‌న అని భావించాల‌ట‌. అంతేకానీ రోజులో ఎప్పుడో ఒక సారి వ‌స్తే దాంతో ఇబ్బంది ప‌డాల్సిన అవ‌సరం లేద‌ట‌.

బాగా తిన్న‌ప్పుడు మ‌న‌కు వెనుక నుంచి గ్యాస్ వ‌స్తుంద‌ని పైన చెప్పాం క‌దా. అవును, అయితే అలా తిన్న‌ప్పుడు స‌హ‌జంగా ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాక‌పోవ‌డం వ‌ల్లే అలా గ్యాస్ వ‌స్తుంద‌ట‌. దీంతో మ‌నం దిగులు చెందాల్సిన ప‌నిలేదు. కొంత సేపు ఉండ‌గానే ఆ గ్యాస్ త‌గ్గిపోతుంది. మ‌నం తిన్న ఆహారం మొత్తాన్ని జీర్ణం చేసే ప‌నిలో శ‌రీరం పెద్ద మొత్తంలో నీటిని త‌న వ‌ద్ద ఉంచుకుంటుంది. అందుకే గ్యాస్ రిలీజ‌వుతుంది.

దుర్వాస‌న‌తో కూడిన గ్యాస్ వెనుక నుంచి వ‌స్తే మనం ముక్కు మూసుకుంటాం. కానీ ఆ గ్యాస్‌ను ఎక్కువ పీలిస్తే న‌ష్టం కానీ కొద్ది మొత్తంలో పీలిస్తే దాంతో మ‌న ఆరోగ్యానికి మంచే జ‌రుగుతుంద‌ట‌. ఎందుకంటే అలాంటి గ్యాస్‌లో ఉండే హైడ్రోజ‌న్ స‌ల్ఫైడ్ అనే ర‌సాయ‌నం మ‌న శ‌రీరంలోని ప‌లు రుగ్మ‌త‌ల‌కు ఔష‌ధంగా ప‌నిచేస్తుంద‌ట‌.

farting

బాగా ఎక్కువగా జంక్ ఫుడ్‌, మాంసం తినేవారికి దుర్వాస‌నతో కూడిన గ్యాస్ వ‌స్తుంద‌ట‌. అస‌లు గ్యాస్ రాక‌పోయినా అది అనారోగ్యానికి సంకేత‌మేన‌ట‌. ఫైబర్ (పీచు ప‌దార్థం) ఎక్కువ‌గా తిన‌కుంటే గ్యాస్ సరిగ్గా రాద‌ట‌. దీంతో ఇత‌ర జీర్ణ సంబంధ అనారోగ్యాలు క‌లిగేందుకు అవ‌కాశం ఉంటుందట‌. కాబ‌ట్టి మీకు అసలు గ్యాస్ రాకుంటే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తినండి. దీంతో గ్యాస్ వ‌స్తుంది, ఆరోగ్యం క‌లుగుతుంది.

బ‌క్క ప‌లుచ‌గా ఉన్న వారికే ఎక్కువ‌గా గ్యాస్ వ‌స్తుంద‌ట‌. అందుకే అలా ఉన్న‌వారే ఎక్కువ‌గా ఆరోగ్యంగా ఉంటార‌ట‌. లావుగా ఉన్న వారికి తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక గ్యాస్ వ‌స్తుంద‌ట‌. కూర‌గాయ‌లు, పండ్లు ఎక్కువ‌గా తింటే జీర్ణ‌క్రియ సాఫీగా జ‌రిగి గ్యాస్ వ‌స్తుంది. అది లావుగా ఉన్న వారికి మేలు చేస్తుంది.

న‌లుగురిలో ఉన్న‌ప్పుడు కొంత మంది వెనుక నుంచి గ్యాస్ వ‌స్తుందంటే చాలు దాన్ని ఆపుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ అలా ఆపుకోకూడ‌ద‌ట‌. ఎందుకంటే గ్యాస్‌ను బ‌య‌ట‌కు రానీయ‌కుండా ఆపితే అది పేగుల్లో చిక్కుకుని పేగులు వాపుల‌కు గుర‌వుతాయ‌ట. సో, గ్యాస్ వ‌స్తుందంటే దాన్ని ఆపుకోకండి.

గ్యాస్‌ను వెనుక నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌టికి వ‌దులుతుంటే శ‌రీరం బాగా రిలాక్స్ అవుతుంద‌ట‌. దీంతో టెన్ష‌న్, ఒత్తిడి వంటివి కూడా పోతాయ‌ట‌. కాబ‌ట్టి ఆ గ్యాస్ వచ్చిందంటే ఆపుకోకండి, వెంట‌నే విడుద‌ల చేసేయండి, ఎక్క‌డైనా, ఎప్పుడైనా..!

Comments

comments

Share this post

scroll to top