ప్రతిభకు పేదరికం అడ్డుకాదు… తమ సృజనాత్మక మోడల్స్ తో ఇండియా తరఫున జపాన్ కు వెళ్ళనున్న కూలీబిడ్డలు.!

ఇద్దరూ రైతుబిడ్డలే…అంతంత మాత్రం చదువులే…అయినా దేశానికి తమ వంతుగా ఏదైనా చేయాలనే ధృఢ సంకల్పం వారిలో….ఆ సంకల్పమే వారిని ఇప్పుడు జార్ఖండ్ నుండి జపాన్ కు తీసుకెళ్ళింది. వారికొచ్చిన సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా సరికొత్త ఆవిష్కరణలను చేసి….పెద్ద పెద్ద శాస్త్రవేత్తలను కూడా ఔరా అనిపించారు. వారే జార్ఖండ్ లోని బుందు ప్రాంతానికి చెందిన 15 ఏళ్ళ పుష్పకుమారి మరియు రామ్ ఘర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ళ అనిల్.  సృజనాత్మక ఆలోచనతో తయారు చేసిన వీరి మోడల్స్ భారత్  నుండి జపాన్-ఆసియా యూత్ సైన్స్ ఎక్సేంజ్ కార్యక్రమానికి సెలెక్ట్ అయాయి.. వాటినే మేలో జపాన్ లో జరగనున్న  కార్యక్రమంలో వాటిని ప్రదర్శించనున్నారు.

శిశుపోషకాహారంపై పుష్ప ఆలోచన:
మనదేశంలో చాలామంది చిన్నపిల్లలకు సరైన పోషకాలతో కూడిన ఆహారం లభించేట్లదని, ఆ దిశగా ఏదైనా చేయాలని పదిహేనేళ్ళ పుష్ప ఆలోచించేది.  గోధుమ, వేరుశెనగ, సోయాబీన్, తులసి మరియు అయోడిన్ ఉప్పు లాంటి పోషక విలువలుగల పదార్థాలనుపయోగించి  “బేబే అమృత్” అనే పౌష్టికాహార ప్రొడక్ట్ ను తయారు చేసింది. 59/- రూపాయలకే 1KG  ఉండే ఈ ప్యాక్ లో  శిశువుల సంపూర్ణ  ఎదుగుదలకు అవసరమయ్యే అన్ని పోషకాలున్నాయి. ఈ ప్రొడక్ట్ తయారీలో  పుష్పకు శశికాంత్ మిశ్రా సహాయం చేసేదట. దీనికి  ఐఐటీ ఢిల్లీ  ఇన్స్పైర్ అవార్డును అందుకుంది పుష్ప.ఇప్పుడు ఇదే  బేబే అమృత్  ను జార్ఖండ్ రాష్ట్రంలోని  అన్ని అంగన్ వాడీ స్కూల్స్ కి పంపిస్తున్నారంట ఆ రాష్ట్ర ప్రభుత్వం.
JtI-750x500
పుష్ప…. 11 ఏళ్ళ వరకు స్కూలంటేనే తెలియదు…పేదరికం కారణంగా పశువులను కాస్తూ ఉండేది… లేటుగా స్కూల్లో జాయిన్ అయ్యింది. అప్పటి నుండి ఆమె ఆలోచన శైలే మారింది.
బొగ్గుగనుల కోసం అనిల్ కృషి:
జార్ఖండ్ లోని తోప అనే గ్రామంలో శ్రామిక్ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న అనిల్, వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. బొగ్గు గనుల నుండి బొగ్గును వెలికితీసిన తర్వాత మళ్లీ అదే గనుల అంతర్భాగంలో  దుమ్ము పదార్థం ఉంచి మళ్ళీ  బొగ్గును ఎలా పొందవొచ్చో నని తెల్పేదే ఇతని మోడల్. ఇతని కృషికి కూడా  ఇన్స్పైర్ అవార్డుకు దక్కింది.  ఇదే మోడల్ జపాన్ లో ప్రదర్శించడానికి అనిల్ జపాన్ వెళుతున్నాడు. అనిల్ స్కూల్ టీచర్స్ అంతా కలిసి అతని జపాన్  పర్యటనకు అవసరమైన అన్ని ఖర్చులు భరించాలని నిర్ణయించుకున్నారు.
JtI-750x500
అనిల్ ది పూర్తిగా రైతు కుటుంబం… ఉన్న కొద్దిపాటి పొలమే వారి జీవనాధారం.
మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఒకే ఒక్క విషయం . సాధించే సత్తా ఉంటే  పేదరికం అడ్డు కాదు, కృషి ,పట్టుదల, ఆసక్తి అనే ఆయుధాలు మన సొంతం అయినప్పుడు ఇతర ఏ శక్తులు కూడా మన విజయాన్ని ఆపలేవు, మన ప్రతిభను దాచలేవు. సో.. ఈ యంగ్ స్టర్స్ జపాన్ పర్యటన సక్సెస్ కావాలని మనమంతా కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top