ఐక్యమత్యం అంటే అది…..ఊరంతా కలిసి సొంతంగా డ్యామ్ కట్టుకుంటున్నారు!

ఎవరో వస్తారని… ఏదో చేస్తారని… ఎదురు చూసి మోసపోకుమా… నిజం మరచి నిదురపోకుమా… అన్నాడో క‌వి. ఎవ‌రి ప‌ని వారే చేసుకోవాలి, అది వ్య‌క్తిగత‌మైనా, స‌మాజ సంబంధ‌మైనా… ఎవ‌రి కోసం ఎదురు చూడ‌కూడ‌దు. ఎవ‌రో వ‌చ్చి ఏదో చేస్తార‌ని అస్స‌లు నిరీక్షించ‌కూడ‌దు… ఇదీ ఆ కవి అందులో తెలియ‌జేసింది… దీన్ని అక్ష‌రాలా పాటించారు ఆ గ్రామ వాసులు. ఎన్నో ఏళ్లుగా త‌మ గ్రామంలో ఓ డ్యామ్ నిర్మాణం కోసం ఎదురు చూస్తూ వ‌చ్చారు. ప్ర‌భుత్వాలు మారాయి. నేత‌లు వ‌చ్చి వెళ్లారు. అయిన‌ప్ప‌టికీ ఆ గ్రామ వాసుల విన‌తిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. చివ‌ర‌కి ఆ గ్రామ‌వాసులే సొంతంగా డ్యామ్‌ను నిర్మించుకున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ ఏదా గ్రామం..? వారు ఎలా డ్యామ్‌ను నిర్మించుకున్నారు..?

dam-up

అది ఉత్త‌రప్ర‌దేశ్‌లోని బ‌హేరి జిల్లా తెహ్రా గ్రామం. ఆ గ్రామంలో బ్రిటిష్ కాలం నాటి డ్యామ్ ఒక‌టి ఉండేది. దాని ద్వారా తెహ్రా గ్రామంతోపాటు దాని చుట్టు ప‌క్క‌ల ఉన్న 25 గ్రామాల‌కు నీరు అందేది. త‌ద్వారా వ్య‌వసాయం, తాగునీరు వంటి స‌దుపాయాలు తీరిపోయేవి. అయితే క్ర‌మంగా ఆ డ్యామ్ ప‌గిలిపోవ‌డం మొద‌లు పెట్టింది. దీంతో అధికారులు ప్ర‌తి ఏటా దానికి తాత్కాలికంగా మ‌రమ్మ‌త్తులు చేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆ డ్యామ్ కాస్తా 1990లో కూలిపోయింది. దీంతో దాని గురించి అధికారులు ప‌ట్టించుకోవ‌డం మానేశారు. క్ర‌మంగా ఆ విష‌యం మ‌రుగున ప‌డిపోయింది. అయితే డ్యామ్ కూలిపోవ‌డంతో స‌ద‌రు గ్రామాల ప్ర‌జ‌ల‌కు నీటి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

వ్య‌వసాయానికే కాదు, తాగునీటికి కూడా స‌ద‌రు గ్రామాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అలా గ‌త 26 ఏళ్లుగా ఆ గ్రామ‌వాసులు నీటి కోసం నానా క‌ష్టాలు ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో అనేక మంది నాయ‌కులు వ‌చ్చి వెళ్లారు. ప్ర‌భుత్వాలు కూడా మారాయి. అయినా డ్యామ్ గురించి ఆ ప్ర‌జ‌లు చేసిన విన‌తిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో ఇటీవ‌లే ఆ ప్ర‌జ‌లు తామే సొంతంగా డ్యామ్‌ను నిర్మించుకున్నారు. అది కేవ‌లం రూ.70వేల ఖ‌ర్చుతో. అంద‌రూ క‌లిసి పోగేసిన మొత్తంతో డ్యామ్ నిర్మాణం చేప‌ట్టారు. ఈ నెల 17వ తేదీన ప్రారంభ‌మైన ఈ ప‌నులు 28వ తేదీన ముగియ‌నుండ‌గా, 98 అడుగుల పొడ‌వు, 20 అడుగుల వెడ‌ల్పుతో స‌ద‌రు డ్యామ్‌ను బుర‌ద‌, ఇసుక సంచుల‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ డ్యామ్‌ను గురించే ప‌ట్టించుకోని అధికారులు ఇప్పుడు ఆ గ్రామ‌స్తులు చేస్తున్న పని వ‌ల్ల అక్క‌డికి వ‌చ్చి నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. అంతేలే, ఖ‌ర్చు ప్ర‌భుత్వంది కాదుగా, మీకు కూడా ప‌ని లేదు. ఏదో అలా గాలివాటంగా వ‌చ్చి ఒక‌సారి చూసి వెళ్తారు. త‌ప్పితే, మీకు పెద్ద‌గా ప‌నేముంటుంది.

ఏది ఏమైనా స‌ద‌రు గ్రామాల వాసులు చేసిన ప‌ని ఇంకో గ్రామానికి కూడా స్పూర్తినిచ్చింది. ద‌గ్గ‌ర్లోనే ఉన్న ఖ‌మారియా అనే మ‌రో గ్రామంలోనూ ఇలాగే డ్యామ్‌ను నిర్మించుకోవాల‌ని స‌ద‌రు గ్రామ వాసులు చూస్తున్నార‌ట‌. అంతే మరి, ఓట్లు వేసి గెలిపించిన నాయ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు ప‌ట్టించుకోక‌పోతే మ‌న‌కైనా బుద్ధి ఉండాలిగా. మ‌న పొట్ట కూటి కోసం మ‌నకు మ‌న‌మే స‌హ‌క‌రించుకోవాలి, ప‌ని చేసుకోవాలి, అంతే త‌ప్ప పైన చెప్పిన‌ట్టుగా ఎవ‌రో ఏదో చేస్తార‌ని అస్స‌లు వేచి చూడ‌కూడ‌దు. మ‌రి ఈ మాత్రం దానికి ప్ర‌భుత్వాలు, అధికారులు ఎందుకో..!

Comments

comments

Share this post

scroll to top