NTR పొలిటికల్ ఎంట్రీ కి ఇదే కరెక్ట్ టైమంట!!

అబ్బో……. అభిమానులు అంటే అభిమానులే. తాము అభిమానించే  వారి విషయంలో, వారి  ఆలోచన ఎంత దూరం వరకు వెళుతుందో అంచనా వేయడం మాత్రం అసాధ్యం.  తాజాగా నోటు కు ఓటు కేసు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కుదుపేస్తుంటే, .  అభిమానులు మాత్రం  జూనియర్ ఎన్టీఆర్  ఇదే కరెక్ట్ టైమ్ ఎంటర్ అయిపో బాసూ,  అని ఆశీర్వదిస్తున్నారు.

jr ntr political entry

 

ఓటు కు నోటు కేసు విషయంలో ఒక వైపు టిడిపిని ప్రతిపక్షాలు  కౌంటర్ చేయడం, మరో వైపు  ఏసిబి అధికారులు  చంద్రబాబు కు ఎప్పుడైనా నోటీసులు జారీ చేసే అవకాశాలు  ఉన్నాయి అనే  పుకార్లు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో  తాత స్థాపించిన పార్టీని  రక్షించే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలనే డిమాండ్ లు అభిమానుల నుండి వెల్లువెత్తున్నాయి, దీనికి సోషల్ మీడియా వేదికైంది.

తాత హావాభావాలు పలికించడం, మంచి వాగ్థాటి కలిగి ఉండడం,  ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉండడంతో ఎన్టీఆరే తెలుగు దేశం పార్టీని ప్రస్తుత పరిస్థితి నుండి గట్టెక్కిస్తాడని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఎన్టీఆర్ గనక పార్టీ పగ్గాలు చేపడితే ఇటు తెలంగాణ లో కూడా పార్టీ పునర్వైభవాన్ని పొందుతుందని విశ్లేషకులు  అంటున్నారు.

jr ntr ready to politics

ఫ్యాన్స్ కోరిక నిజమై జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? లేక సినీ జీవితంలో కొనసాగుతారా అనేది వేచి చూడాల్సిందే!!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top