కరెన్సీ నోటు పై కలాం కు చోటు కల్పించాలి!

ఇండియన్ మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం నింగికెగిసాక…ట్విట్టర్లు, ఫేస్ బుక్ లు, ఇంట్లోని టివిలు, కంప్యూటర్  వెబ్ సైట్లు అన్నీ టన్నుల కొద్ది కన్నీటిని కార్చేశాయి. అందరూ ఆ సాధుమూర్తికి కన్నీటి నివాళులు అర్పించారు. అయితే యూత్ మాత్రం కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చింది ,తేవడమే కాదు దాన్ని బలంగా ప్రచారం చేసే పనిలో పడింది.

మాతరం గాంధీని చూడలేదు, కానీ మేం చూసిన గాంధీవి నువ్వే, మా స్పూర్తి ప్రధాతవు నువ్వే ..అంటూ కలాంకు సలాం చేశారు. మరికొంత మందైతే  కరెన్సీ నోట్లపై  కలాం ఎందుకుండకూడదు అంటూ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి, భారతరత్న అవార్డీ, దేశ అత్యున్నత రాజ్యంగ బద్ద పదవిని అలంకరించిన వ్యక్తి, అన్నింటికి మించి అద్బుత శక్తి, ఇంకా చెప్పాలంటే కల్మషం లేని మనిషి, గాంధీని మించిన అహింసావాది. ఇన్ని లక్షణాలు ఉన్న కలాంకు కరెన్సీ మీద ఉండే అర్హత నూటికి నూరు శాతం ఉంది అంటూ తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు.

 

ఎలాగో ప్రభుత్వం కూడా ఫ్లాస్టిక్ కరెన్సీని వాడుకలోకి తేవాలనే ప్రయత్నంలో ఉంది కాబట్టి….  100 ,500,1000 నోట్లలో ఎదో ఒక కరెన్సీ ని  అబ్దుల్ కలాం ఫోటో తో విడుదల చేయాలనే డిమాండ్ లు వినిపిస్తున్నాయ్.. ఇండియన్ కరెన్సీ స్టార్ట్ అయినప్పటి నుండి కరెన్సీ నోటు పై గాంధీ ఫోటోనే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు ఉన్నపలంగా గాంధీని తొలగించాల్సిన అవసరం లేనప్పటికీ, కలాం కు కూడా ఇండియన్ కరెన్సీ లో  స్థానాన్ని కల్పించాలని  కొరుతున్నారు కలాం అభిమానులు. ఇదిగో వాళ్లు రూపొందించిన నినాదాన్ని మీరూ చూడండి ఈ ఫోటో లో…

post

 

మరి మీరేమంటారు.

ఇండియన్  కరెన్సీ హిస్టరీలోకి తొంగి చూస్తే…. ఇండియాలో మొదటి సారిగా షేర్‌షా సూరి ప్రవేశపెట్టాడని భావిస్తున్నారు. ఇక రూపాయి కాగితాలను మొదటగా ముద్రించినవారు “బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్” (1770-1832),  స్వాతంత్ర్యానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ.. అంటూ డిఫరెంట్ గా ఉండేవి. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక, వీటన్నిటినీ తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. 1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించారు. 5 రూపాయల నుండి 1000రూపాయల వరకు ఉన్న నోట్లను మహత్మాగాంధీ శ్రేణి అంటారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top