ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ కాళ్లు మొక్కిన చెన్నై అభిమాని..! షాకింగ్‌..!

త‌మిళ సూప‌ర్ స్టార్ అజిత్‌కు అక్క‌డ ఏ ర‌క‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అజిత్‌ను త‌ల అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. అయితే ఇప్పుడు తమిళ‌నాడు వాసులు మ‌రో వ్య‌క్తిని కూడా అలా పిలుస్తున్నారు. అత‌నే చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ధోని. ధోనికి దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారో పెద్దగా చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌తంలో ఓ సారి ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ ఆడుతుండ‌గా ధోనీ పిచ్ మ‌ధ్య‌లో ఉన్న‌ప్పుడు ఓ ఫ్యాన్ స్టేడియం గ్యాల‌రీ నుంచి దూసుకు వ‌చ్చి ధోనీ కాళ్ల‌ను మొక్కి వెంట‌నే వెళ్లిపోయాడు గుర్తుంది క‌దా. అవును, ఐపీఎల్‌లోనూ ఇప్పుడు అదేలాంటి సీన్స్ మ‌ళ్లీ రిపీట్ అవుతున్నాయి.

తాజాగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ డ‌గౌట్‌లో ఉండి తన టీమ్ మేట్స్‌తో మాట్లాడుతున్న‌ప్పుడు గ్యాల‌రీలో నుంచి ఓ అభిమాని దూసుకువ‌చ్చి ధోనీ కాళ్లను మొక్కి వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. సెక్యూరిటీని దాటుకుని మ‌రీ అత‌ను రావ‌డంతో ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. అయినా అత‌ను ధోని కాళ్ల‌ను మొక్కి వెనుదిరిగాడు క‌నుక అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్ర‌మంలో అలా ఆ అభిమాని ధోనీ కాళ్ల‌ను మొక్క‌డాన్ని ధోనీ ఇత‌ర టీం మేట్స్ చూసి ఒక్క‌సారిగా షాక‌య్యారు. ముర‌ళీ విజ‌య్‌, షేన్ వాట్స‌న్‌, మెంటార్ మైక్ హ‌స్సీలు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

అయితే అలా అభిమాని ధోనీ కాళ్ల‌ను మొక్కిన వీడియో ఇప్పుడు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దాన్ని చూసి చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ధోనీ ప‌ట్ల త‌మ అభిమానాన్ని ఇలా చాటుకోవ‌డ‌మే కాక‌, సోష‌ల్ మీడియాలో అత‌న్ని ముద్దుగా త‌ల అని అజిత్‌ను పిలిచిన‌ట్టు పిలుచుకుంటున్నారు. దీంతో ఇప్పుడు అభిమానుల‌చే ఆ గౌర‌వం ద‌క్కిన రెండో వ్య‌క్తిగా ధోనీ పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా త‌మిళ‌నాడులో అయితే ధోనీకి మ‌రీ వీరాభిమానులు ఏర్ప‌డిపోయారు. అవును మ‌రి.. చెన్నైకి మ‌రిచిపోలేని విజ‌యాల‌ను అందించాడు క‌దా. అందుక‌ని ధోనీ అంటే వారికి అంత ఇష్టం..!

 

Comments

comments

Share this post

scroll to top