ప్రేమమ్ లో పాపులర్ అయిన పిట్టకథ. మీకోసం.

ఓ అమ్మాయి తనకోసం వెయిట్ చేస్తుంటే…పట్టి పట్టనట్టు ఉన్న హీరో నాగచైతన్యకు కమెడీయన్ శ్రీనివాస్ రెడ్డి బోధించిన కథే..ఈ పిట్టకథ.  కట్నం ఆశ ఉన్న చాలా మంది తల్లీదండ్రులకు, పెళ్ళిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న పెళ్లికాని ప్రసాద్ లకు సింగిల్స్ వేసినట్టు ఉంది ఈ కథ.

మొదటగా..

కొడుకు డిగ్రీ పట్టా చేత పట్టుకొని తల్లి దగ్గరికి రాగానే…ఆనందంలో ఉబ్బితబ్బిబైన తల్లి…పంతులుగారు నా కొడుక్కి పిళ్లని చూడండి పెళ్లి చేయాలి. మా ఫ్యామిలీ గురించి తెలుసుగా…. కోటి రూపాయలు కట్నం, 25 లక్షలు ఆడబిడ్డ కట్నం కావాలి. అమ్మాయికి వంటచేయడం బాగా వచ్చిఉండాలి.

పంతులు: సరే అమ్మా.

5 యేళ్ల తర్వాత:

 • తల్లి: పంతులు గారు నా కొడుక్కి అమ్మాయిని  చూడండి…కట్నం  50 లక్షలు ఇచ్చినా పర్లేదు.
 • పంతులు: మరి ఆడబిడ్డ కట్నం?
 • తల్లి: దానికెందుకు డబ్బులు.

4 యేళ్ల తర్వాత:

 • తల్లి: పంతులు గారు…ఓ అమ్మాయిని చూసి మా వాడికి పెళ్లి చేయండి, కట్నం అవసరం లేదు. ఉన్నదంతా ఏం చేసుకుంటాం.
 • పంతులు: మరి వంట?
 • తల్లి: నాకు చేతనైనంత కాలం నేనే వండి పెడతా…

ఫోన్ లో……..

 • కొడుకు: అమ్మా చెప్పమ్మ..
 • తల్లి: ఎవర్నో ఒకర్ని చేసుకొని తగలడ్రా…ఇక్కడ ఇంటి పక్కోళ్లకు  సమాధానాలు చెప్పలేక చస్తున్నాం.
 • ఫైనల్ గా ఓ అమ్మాయిని ఫిక్స్ చేసుకొని పెళ్లి చేసుకుందామని తల్లికి ఫోన్ చేస్తే.
 • కొడుకు: అమ్మా..మంచి కసక్కు లాంటి ఫిగర్ ఓకే అయ్యిందే పెళ్లి చేసుకుంటా?
 • తల్లి:  మరి కట్నం??????

#వీళ్లు మారరండి.

 

Comments

comments

Share this post

scroll to top