ఇతను వాడే రెండు బల్బులు, ఒక ఫ్యాన్ కు 39 కోట్ల కరెంట్ బిల్ వచ్చింది.!?

నెలకు 300 రూపాయల కరెంట్ బిల్లు వస్తే వామ్మో ఇంత బిల్లా అని షాక్ కు గురిఅవుతాం. అలాంటిది ఏకంగా 39 కోట్ల కరెంట్ బిల్లు వస్తే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అంతగా కరెంట్ బిల్లు రావడానికి వారిది బడా ఫ్యామిలీ కాదు, ఏసి, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ లు లేవు. అవి ఉన్నా ఏ వందల్లోనే, మహా అయితే వేలల్లోనే బిల్ వస్తుంది. ఏకంగా రూ. 39 కోట్ల కరెంట్ బిల్లు అదీ ఒక నెలకు సంబంధించింది కావడంతో ఒక్కసారిగా విస్తుపోయాడు ఆ ఇంటి యజమాని. ఈ ఉదంతం జమ్మూ కాశ్మీర్  రాష్ట్రంలో టలబ్ టిల్లోలోని పురాన్ నగర్ లో మధ్య తరగతి కుటుంబంలో నివసించే రామ్ కిషన్ కరెంట్ మీటర్ లో జరిగింది.

అతను అక్టోబర్ నెలకు గానూ రూ.39కోట్ల బిల్లును అందుకున్నాడు. మాది ఒక మధ్య తరగతి కుటుంబం.. మా ఇంట్లో కరెంట్ తో వాడే పెద్ద వస్తువలు ఏవీ లేవు, బహుశా పెద్ద జమీందార్ ల కుటుంబం కూడా ఇలాంటి బిల్లు ఎప్పుడూ చూసి ఉండడేమో అని” ఆ బిల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటి యజమాని అన్న మాటలు. అయితే కరెంట్ బిల్లు అందించే బిల్లింగ్ సాఫ్ట్ వేర్ చేసిన తప్పు వల్ల ఈ బిల్లు వచ్చిందని, బిల్లింగ్ మీటర్ లో ఏదో తప్పు జరిగిందని అధికారులు తెలిపారు. ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే దానికి సంబందించిన ఇష్యూను సాల్వ్ చేస్తామని ఎలక్ట్రిక్ అధికారులు అంటున్నారు.

bill1-750x500

కోట్లలో బిల్లు వచ్చింది కాబట్టి సాఫ్ట్ వేర్ సమస్యలు అని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమై కచ్చితంగా మీరు ఈ బిల్ పే చేయాలని ఆ అధికారులు వాదించివుంటే వారి పరిస్థితి ఏంటి? కొంచెం చూసుకోండి బాస్.

Comments

comments

Share this post

scroll to top