AIDS కి మందు కనిపెట్టిన GOVT Hospital కాంపౌండర్.!?

AIDS కి మందు కనిపెట్టిన GOVT Hospital కాంపౌండర్.!? ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. అయితే ఇదంతా పెద్ద ట్రాష్… యావత్ ప్రపంచం  ఎయిడ్స్ మహమ్మారిని నిర్మూళించాలని చూస్తున్న తరుణంలో కాంపౌండర్ ఎయిడ్స్ కు మందు కనిపెట్టాడనే ప్రచారం పూర్తిగా అవాస్తవం…అయినా ఇంత చదువు చదివిన మనం ఇలాంటి విషయాలను ఇంత సింపుల్ గాఎలా నమ్ముతున్నామో అర్థం కాని పరిస్థితి….. పదిసార్లు అబద్దాన్ని నిజం.నిజం…నిజం అని చెప్పి అదే నిజమని నమ్మిచే పనిలో చాలా మందే నిమగ్నమై ఉన్నారు. ఇది చార్మినార్ నిర్మాణం నాటి ఫోటో అని అప్పుడప్పుడు ఓ ఫోటో ఫేస్ బుక్ లో విపరీతంగా షేర్ అవుతుండేది….కానీ కామన్ సెన్స్ ఏంటో తెలుసా? అప్పటికి ఇంకా కెమెరా కనిపెట్టబడలేదు.

2DAD359500000578-0-image-a-26_1445566392414

ఇప్పుడు ఎయిడ్స్ కు మందు కనిపెట్టిన కాంపౌండర్ అనే స్టోరీని  అల్లిన విధానాన్ని ఓసారి పరిశీలిద్దాం.

 

ఇదిగో ఇతడే ఆ wonder man.పేరు కనకయ్య. చేసే పని నిజామాబాద్ సర్కార్ దవాఖానా లో కాంపౌండర్. ఇతడి పేరు ఇప్పటిదాకా ఆ ఆస్పత్రిలోనే చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద పరిశోధకులు, డాక్టర్ల వల్ల కాని పని ఈ సాధారణ కాంపౌండర్ చేశాడు. ఈ సేవకు గానూ, సకల మానవాళిని Aids భూతం నుండి రక్షించినందుకు గానూ world health organisation ( WHO) ఏకంగా మనోడికి Doctor of the world _ ప్రపంచానికే వైద్యుడు అన్న బిరుదిచ్చేసింది.

ఇంతకీ ఇతను ఆ మందు ఎలా కనిపెట్టాడు? అసలా మందేంటి? ఆయన మాటల్లోనే విందాం. Sorry చదువుదాం.

కనకయ్య: Salt Tea. అదే సార్.. ఉప్పు చాయ్.. అంటే చాయ్ లో చక్కరకు బదులుగా ఉప్పు వేసుకుని తాగడమే. అంతే. అదే మందు. నాకెలా తెలిసిందంటే accident అయి కోమాలోకి వెళ్లిన ఒక పేషంట్ కి నేను రోజూ రెండు సార్లు చాయ్ తాగించాల్సి వచ్చింది. రోజూ పాలు రాగానే చక్కర కు బదులు చక్కెరను, చాయ్ పత్తి కలిపి వేడి చేసి ఇచ్చేవాడిని. ఒక నెల రోజులకు ఆయన కోమా లోంచి బయటకు వచ్చి ఆరోగ్యం కుదుటపడి discharge ఐ వెళ్ళిపోయారు. తర్వాత సడెన్ గా ఒక రోజు నా దగ్గరికి వచ్చి కోమాలో ఉన్న నెల రోజులు నేనేం తిన్నాను, యేం తాగాను అని అడిగాడు. నేను విషయం చెప్పాను.. అంతే.. ఎగిరి గంతేసి నన్ను గట్టిగా కౌగిలించుకుని ఒక పద్ ..ది రూపాయల నోటు నా చేతిలో పెట్టి ” నాకు Aids ఉండేది, కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే లేదని report వచ్చింది. అందుకే ఈ సంతోషం ” అని చెప్పి ఈలేసుకుంటూ వెళ్ళిపోయాడు.

aids

నాకేం అర్ధం కాక ఓసారి గదిలోకెళ్లి ఆయనకు చాయ్ ఎట్లా కలిపి ఇచ్చానో అట్లా నేనే కలుపుకుని తాగాను. వా..క్..క్… ఒక్కసారిగా ఉమ్మేశాను. డౌటొచ్చి చక్కెర డబ్బాను జాగ్రత్తగా చూస్తే అందులో చక్కెర కాదు.. ఉప్పుంది. అంటే అన్ని రోజులూ నేను ఆయనకు ఉప్పు చాయ్ ఇచ్చానన్నమాట.. సరే తెలిసింది. కానీ నమ్మలేక ఇంకోసారి టెస్ట్ చేయాలనిపించింది. మా ఊళ్లో ఇద్దరు పోరగాండ్లున్నరు. చెడు తిరుగుళ్లు తిరిగి Aids ని కొనుక్కొచ్చుకున్నరు. వాళ్లను పిలిచి ఒక నెల రోజులు ఉప్పు చాయ్ ఇచ్చాను. అంతే.. Next month వాళ్ళిద్దరికీ Aids negative వచ్చింది. ఇక confirm అయిపోయింది కాబట్టి మీ press వాళ్లను పిలిచాను.. అని అన్నాడు.

మంత్రాలకు చింతకాయలు రాలవు…ఉప్పుకు ఎయిడ్స్ తగ్గదు అని తెలుసుకోలేని విజ్ఞానాన్ని మన చదువు మనకందించిందా? మేక ను కుక్క అని చూపించిన సోషల్ మీడియా ప్రభావమో తెలియదు కానీ…..ఈ వార్త ఇంకా ఫేస్ బుక్ లలో కనిపించడం..అది కూడా చదువుకున్న వారి టైమ్ లైన్ మీద కనిపించడం ఆశ్చర్యకరమే.!

—————————–by:రఘువీర్ రాథోడ్.

Comments

comments

Share this post

scroll to top