మినరల్ వాటర్ తాగుతున్నారా..అయితే ఖచ్చితంగా చదవాల్సిందే.!

ఒకప్పుడు తాగడానికి గ్లాసుడు నీళ్లు అడిగితే  చెంబు నిండా  వాటర్ ఫ్రీ గా ఇచ్చేవారు..ఇప్పుడు తాగాడానికి నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి..సడన్ గా వాటర్ బాటిల్  తీసుకెళ్లడం మర్చిపోతే ఒక బాటిల్ కొనుక్కుంటే సరిపోతుంది అనుకుంటాం..అందులోనూ మినరల్ వాటర్ తాగడం గొప్పగా ఫీల్ అవుతుంటాం..కొంచెం పేరున్న బాటిల్ కొనుక్కుని తాగడానికి ఇష్టపడతాం..ఈ న్యూస్ చదివితే ఇక వాటర్ కొనుక్కుని తాగాలనే ఆలోచనకే భయపడతారు…

బ్రాండెడ్ కంపెనీ అని చెప్పుకుంటూ నాసిరకం వాటర్ అమ్ముతున్నారంటూ పబ్లిక్ నుంచి ఫిర్యాదులు అందడంతో ఒక పరిశీలన మొదలుపెట్టారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా సరైన లైసెన్స్ లేని కంపెనీల లిస్ట్ తయారు చేయాలని భావించారు. అలాగే ప్రతి కంపెనీ ఖచ్చితంగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాల నుంచి కచ్చితంగా రెండు లైసెన్సులు పొంది ఉండాలని ఆదేశించారు. అవి ఎప్పటికి అమలవుతాయోగాని ఇప్పటికైతే మనం సేఫ్ కాదని తేలిపోయింది.అదెలా అంటే..

మన దేశంలో మొత్తం 6000 మినరల్ వాటర్ ప్యాకేజింగ్ కంపెనీలుంటే వాటిలో 4500 యూనిట్లకు సరైన లైసెన్సులే లేవట. విచిత్రం ఏమిటంటే సరైన లైసెన్స్ లేకుండా మినరల్ వాటర్ తయారుచేస్తున్న కంపనీలలో కిన్లే, బ్లిస్లరీ, యాక్వఫినో కంపెనీలకు చెందిన బ్రాంచ్ లు కూడా ఉన్నాయి. చాలా మినరల్ వాటర్ కంపనీలకు అసలు మినరల్ వాటర్ అంటే ఏమిటో? అందులో ఏం ఉండాలో కూడా తెలియదని, నీటిని ప్రమాణాలకు తగ్గట్లు శుభ్రపరచకుండా అలాగే బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నారని చెప్పారు .నల్ల, బోరింగ్ నుండి వచ్చే నీరే స్వచ్చమైనవి అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు.

Comments

comments

Share this post

scroll to top