వీడో వాతల బాబా..! పిల్లలు పుట్టని మహిళల కడుపు మీద వాతలు పెట్టి తథాస్తు అని దీవిస్తాడు.

సంతానం లేదా ఇతడి దగ్గ త్రిశూలంతో మూడంటే మూడు  వాతలు వేయించుకుంటే మీకు సంతానం కలుగుతుంది.  ఈ ఆధునిక కాలంలో ఇటువంటివి మీరు నమ్ముతారో లేదో తెలీదు కానీ అక్కడి జనం, ఈ బాబా(మనకు దొంగ బాబా) చేస్తున్న చర్యలను నమ్ముతున్నారు.  విశాఖ జిల్లా రావికమతం మండలంలో, కళ్యాణపులోవ దగ్గరలోని చీమలపాడు గ్రామం పరిసరాల్లో అతడు చేస్తున్న పనులు చూడండి.పిల్లలు లేవని బాధపడుతున్న వారిని టార్గెట్ గా చేసుకొని, అతడు ఈ చర్యలు చేస్తున్నాడు. మగవారిలో లోపం ఉంటే వీపు మీద , ఆడవారిలో లోపం ఉంటే పొట్ట భాగాన చిన్నపాటి త్రిశూలాన్ని రెడీ చేసుకొని, కొంచెం వేడి చేసి మూడు వాతలు పెట్టేస్తాడు.

ఈతంతు కూడా శివరాత్రి పండుగ తర్వాత మూడు రోజుల జరుగుతుందట. మూఢ నమ్మకమో లేక సంతానం కలుగుతున్న ఆశతో అతడితో వాతలు వేయించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నారు. ఆ మూడు రోజులు అతడు వీళ్ళ దగ్గర బాగానే వసూల్ చేస్తాడు.. అయితే  ప్రజా సంఘాలు, వైద్యులు వ్యతిరేకిస్తున్నా నమ్మకమే తమని నడిపిస్తుందని అక్కడివారు చెబుతారు.
Watch Video: 

Comments

comments

Share this post

scroll to top