పాక్, బంగ్లా సరిహద్దులోనుండి “భారత్” కి నకిలీ 2000 రూ. నోట్లు తరలింపు!…అవి మార్కెట్ లోకి వస్తే మన పని అంతే!

రెండువేల రూపాయల నోటు వచ్చి కేవలం మూడే మూడు నెలలు  అవుతుంది.అప్పుడే  వాటికీ నకిలీ నోట్లు రెడీ అయ్యాయి.దొంగనోట్ల స్మగ్లర్లు వాటిని పాకిస్థాన్ నుంచి భరత్ లోకి చేరవేస్తున్నారు,ఇటీవల కొందర్ని అరెస్ట్ చేసారు, విచారణలో ఈ దొంగనోట్ల బండారం మొత్తం బయటకు వచ్చింది. కుక్క తోక వంకర  అన్నట్టు  పాక్ బుధ్ధి మారదు,భారత్ పట్ల నిలువెల్లా ద్వేషం, మళ్ళీ తన దుష్ట బుద్దిని చూపించింది.భారత ఆర్థిక రంగాన్ని అస్థిర పరచాలన్నది పాకిస్థాన్ దుష్ట పన్నాగం,ఫేక్ నోట్లను అమ్మగా వచ్చిన మొత్తంతో కాశ్మీర్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. బాంగ్లాదేశ్ సరిహద్దుల గుండా పాకిస్థాన్ దొంగ నోట్ల దందా చేస్తుంది,నకిలీ రెండువేల రూపాయల నోట్లను సరిహద్దులను దాటిస్తుంది,జాతీయ దర్యాప్తు సంస్థ NIA , సరిహద్దు భద్రత దళం BSF , ఇటీవల దొంగనోట్ల స్మగ్లింగ్లో కొందర్ని అరెస్ట్  చేసారు.నకిలీ రెండువేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 8 న ముర్షిదాబాద్ లో అజిస్ రెహమాన్ అనే యువకుడు దగ్గరనుంచి దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు, అతడు బెంగాల్ లోని మాల్డా ప్రాంతానికి చెందినవాడిగా తెలిసింది, రెహమాన్ నలబై నకిలీ రెండువేల నోట్లను తరలిస్తుండగా పట్టుకున్నారు.ఆ నోట్లు పాకిస్థాన్ లో ప్రింట్ చేసారు,దీని వెనక ISI హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు,దాని సహాయంతోనే ఈ నోట్లు సరిహద్దులు దాటుతున్నాయి. ఒక్క రెండువేల రూపాయల నోటు మీద స్మగ్లర్లకు 1400 వందల నుంచి 1600 వరకు గిట్టుబాటు అవుతుంది,నోట్ల నాణ్యతను బట్టి స్మగ్లర్లు ప్రతి ఫెక్ రెండువేల నోటుకు నాలుగు నుంచి ఆరువందల వరకు ఒరిజినల్ కరెన్సీని చెల్లించాల్సి ఉంటుంది.

Watch Video Here:

 

Comments

comments

Share this post

scroll to top