“ఫెయిర్ అండ్ లవ్లీ” వాడుతున్నారా..? ఇది తెలిస్తే వెంటనే వాడటం మానేస్తారు..!

బ్యూటీ ప్రోడక్ట్స్‌కు మన దేశంలో ఎంతటి మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే. కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో అవి లాభాలను గడిస్తున్నాయి. ఈ విషయం సరే..! అసలింతకీ వాటిని వాడితే నిజంగానే చర్మం రంగులో మార్పు వస్తుందా..? ఎవరైనా వాటిని వాడితే మంచి రంగుకు మారుతారా..? తెల్లగా అవుతారా..? అంటే… అది ఎంతమాత్రం కాదు. అదే నిజమైతే ఆయా ప్రోడక్ట్‌లను అమ్మే కంపెనీలు కేవలం ఇండియా లాంటి మార్కెట్లనే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాయి..? ఆఫ్రికా దేశాల మార్కెట్లలో ఎందుకు ఇలాంటి క్రీములు, పౌడర్లు, ఇతర కాస్మొటిక్స్ అంతగా కనిపించవు..? అక్కడ వాటి గురించి పబ్లిసిటీ ఎందుకు చేయరు..? అందుకు కారణం ఒక్కటే… మనలో వ్యక్తుల చర్మం రంగు పట్ల ఉన్న అపోహ..! తెల్లగా ఉండాలని ఆశించే మన కోరికే కాస్మొటిక్ సంస్థలకు కాసులు కురిపిస్తోంది. అందుకు ఏ కంపెనీ అతీతం కాదు. అన్నీ వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నవే. వినియోగదారులను మోసం చేస్తున్నవే..! హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి చెందిన ఫెయిర్ అండ్ లవ్లీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుందా..? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అది ఎందుకో ఇది చదివితే మీకే తెలుస్తుంది..!

మహారాష్ట్రలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు ఈ మధ్యే ఫెయిర్ అండ్ లవ్లీకి చెందిన అడ్వాన్స్డ్ మల్టి విటమిన్ క్రీమ్‌ను పరీక్షలు చేశారు. అందులో దిమ్మ తిరిగే నిజాలు తెలిశాయి. సదరు క్రీమ్‌లో మైక్రోబియల్ కౌంట్ 337,532.10 CFU (Colony Forming Units) ఉండగా, ఈస్ట్ అండ్ మోల్డ్ కౌంట్ 294,196.3 CFU గా తేలింది. అంటే ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) అనుమతించిన లిమిట్ కన్నా ఎక్కువే అని అధికారులు గుర్తించారు. ఆ కౌంట్ ఎంత ఎక్కువగా ఉందంటే ఉండాల్సిన దాని కన్నా దాదాపుగా 3వేల రెట్లు ఎక్కువగా ఉన్నట్టు వారు తెలిపారు. ఈ క్రమంలో సదరు ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్‌కు చెందిన మరిన్ని శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నట్టు వారు తెలిపారు. దీనిపై ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.

మైక్రోబియల్ లిమిట్ టెస్ట్ ఎందుకు..?
ఫార్మాసూటికల్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల తయారీ సంస్థలు మైక్రోబియల్ లిమిట్స్‌ను కచ్చితంగా పాటించాలి. అవి తయారు చేసే ఉత్పత్తులకు సంబంధించి ప్రతి బ్యాచ్‌లోనూ శాంపిల్స్ సేకరించి విధిగా భద్ర పరచాలి. అనంతరం అవసరమైనప్పుడు అధికారులు అడిగితే ఆ శాంపిల్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అలా బ్యాచ్‌ల వారీగా శాంపిల్స్‌ను అధికారులు టెస్ట్ చేసి వాటిలో మైక్రోబియల్ లిమిట్ ఎంత వరకు ఉందో పరీక్షిస్తారు. అది ఎక్కువైతే అప్పుడు సదరు కంపెనీలపై చర్యలు తీసుకుంటారు. మైక్రోబియల్ లిమిట్స్‌ను ఆయా కంపెనీలు కచ్చితంగా పాటిస్తున్నాయో లేదో తెలుసుకునేందుకే అధికారులు ఈ పరీక్ష చేస్తారు.

మైక్రోబియల్ లిమిట్ దాటితే..?
ఫార్మాసూటికల్, పర్సనల్ కేర్ ఉత్పత్తులను తయారు చేసే ఏ కంపెనీ అయినా లిమిట్ వరకు మాత్రమే మైక్రోబియల్స్‌ను వాడాల్సి ఉంటుంది. అది దాటితే అప్పుడు అలాంటి ఉత్పత్తులను వాడే వారికి అలర్జీలు వస్తాయి. ప్రధానంగా కళ్లు దురదలు పెట్టడం, నీరు కారడం, తీవ్రమైన దగ్గు, తలొనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, చర్మంపై దద్దుర్లు, మంట, చర్మం ఎరుపెక్కడం, ముక్కు దిబ్బడ, తరచూ జలుబు చేయడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అలా మైక్రోబియల్ లిమిట్ ఎక్కువైన ఉత్పత్తులను వాడితే వాటి వల్ల ప్రమాదకరమైన టాక్సిన్లు (విష పదార్థాలు) మన శరీరంలోకి వెళ్లి తీవ్ర అనారోగ్యలను కూడా కలిగిస్తాయి.

ఫెయిర్ అండ్ లవ్లీ పరిస్థితి ఏమిటి..?
మొన్నా మధ్యే తలెత్తిన మ్యాగీ నూడుల్స్ వివాదం అందరికీ తెలిసిందే. మోతాదుకు మించి సీసం కలుస్తుందన్న కారణంగా ఆ నూడుల్స్‌ను బ్యాన్ చేశారు. తిరిగి ఎలాగో మళ్లీ ఆ సంస్థ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేసింది. అయితే ఇప్పుడు ఫెయిర్ లవ్లీకి కూడా అలాంటి కష్టాలే ఎదురవుతాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే మైక్రోబియల్ పరిమితి పదులు, వందలు కాదు ఏకంగా వేల రెట్లు ఎక్కువగా ఉండడంతో దానిపై ఏం చర్యలు తీసుకోవాలా అని అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరిన్ని బ్యాచ్‌లకు చెందిన శాంపిల్స్‌ను పరీక్షించి గానీ వారు ఆ పనిచేయరు. కనుక… ఎందుకైనా మంచిది అలాంటి బ్యూటీ ఉత్పత్తులను వాడకపోవడమే ఉత్తమం. లేదంటే తీవ్ర అనారోగ్యం బారిన పడితే ఆపైన బాధ పడాల్సింది, విచారించాల్సింది మనమే..!

Comments

comments

Share this post

scroll to top