“భరత్” మృతి కేసులో మరికొన్ని షాకింగ్ నిజాలు..! ఆక్సిడెంట్ కి ముందు 9:45 కి ఏమైందంటే..?

హీరో రవితేజ తమ్ముడు భరత్‌ మృతి కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మద్యం సేవించి కారు నడిపినట్టు వెల్లడైంది. ప్రమాదానికి ముందు ఆయన నోవాటెల్‌ హోటల్‌లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరా రికార్డయ్యాయి. శనివారం ఆయన నోవాటెల్‌లో స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు స్విమ్మింగ్‌పూల్‌ వద్ద ఆయన మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.25 గంటల వరకు ఆయన నోవాటెల్‌లో ఉన్నారు.

తర్వాత అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయారు. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కొత్వాల్‌గూడ వద్ద ఆగివున్న లారీని ఆయన కారు ఢీకొంది. సంఘటనా స్థలంలోనే భరత్‌ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆయన కారు 145 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతివేగం, మద్యంమత్తు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

శనివారం భరత్ ఏం చేశాడంటే:

  • ఈ నెల 24 స్నేహితుడితో నోవాటెల్‌ హోటల్‌కి వెళ్లాడు.
  • సాయంత్రం 2.30కి నోవాటెల్‌ హోటల్‌లో పార్టీలో పాల్గొన్నాడు.
  • సాయంత్రం 4.50కి స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర మద్యం సేవించాడు.
  • దాదాపు ఏడు గంటలపాటు పార్టీలో గడిపాడు.
  • రాత్రి 9.25కి హోటల్‌ నుంచి బయలుదేరాడు.
  • రాత్రి 9.45కి కొత్వాల్‌గూడ దగ్గర ప్రమాదంలో భరత్‌ మృతి చెందాడు.

భరత్ మరణ వార్త కుటుంబ సభ్యులకు ఎప్పుడు తెలిసింది?

భరత్ కుటుంబ సభ్యులకు అతడి మారణ వార్త ఆ రోజు రాత్రి 12 గంటలకే అందింది. అయితే ఆ విషయం మీడియాకి పొక్కకుండా చూడాలని పోలీసులను భరత్ కుటుంబ సభ్యులు కోరినట్లు సమాచారం. అందుకు ఓ సీఐ, ఎస్సై స్థాయి అధికారులు ఓకే అన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే డిపార్ట్‌మెంట్‌లోని చిన్న స్థాయి వ్యక్తి ఒకరు ఉదయం 8.30 సమయంలో ఒక మీడియా ప్రతినిధికి విషయం లీక్ చేయటంతో కథ మీడియా దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ పోలీసు విషయం లీక్ చేసి ఉండకపోతే మీడియాకి తెలియకుండానే భరత్ కథ సమాప్తం అయి ఉండేదని ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఆఫ్ ది రికార్డ్‌గా చెప్పిన మాట.

రక్త సంబంధీకులు ఉంటేనే మృతదేహం అప్పగింత:

ప్రమాదం జరిగిన రాత్రి 12 గంటలకి తల్లి రాజ్యలక్ష్మికి పోలీసులు సమాచారం అందించినా తెల్లవారే వరకు ఉస్మానియా ఆసుపత్రి ముఖం కూడా కుటుంబ సభ్యులు చూడకపోవటం ఆశ్చర్యం.! పోస్ట్‌మార్టం సమయంలోనూ బయటివాళ్లే ఉండటం మరో అంశం. డ్రైవర్ కుమార్‌నే మృతదేహాన్ని తీసుకుని మహాప్రస్థానానికి వెళ్లాలని రవితేజ కుటుంబం ఆదేశించటం గమనార్హం..! అయితే రక్త సంబంధీకులు లేనిదే మృతదేహాన్ని అప్పగించబోమని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది తేల్చి చెప్పడంతో డ్రైవర్ కుమార్ మళ్లీ భరత్ తల్లి రాజ్యలక్ష్మిని సంప్రదించాడు. అందుకే చిన్న కుమారుడు రఘుని అంత్యక్రియల బాధ్యలకు తల్లి పంపించినట్లు తెలుస్తోంది. అయితే భరత్ మృతదేహాన్ని తమ నివాసానికి తీసుకురాకుండా నేరుగా మహాప్రస్థానానికి తీసుకువెళ్ళాల్సిందిగా చెప్పటం కొంత అసహజంగానూ, విచిత్రంగా కూడా అనిపిస్తుంది.

watch video: CCTV Footage

Comments

comments

Share this post

scroll to top