మ‌న దేశంలోని ఈ ఆల‌యాల్లో ఉన్న వింత‌లు, విశేషాలు తెలుసా..! తెలిస్తే షాక‌వుతారు..!

మ‌న దేశంలో ఉన్న అనేక చారిత్ర‌క ఆల‌యాల్లో ఒక్కో ఆల‌యం ఒక్కో ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంటుంద‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయా ఆల‌యాల్లో భ‌క్తులు పాటించే ఆచారాలు చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. కొన్ని చోట్ల దేవుళ్ల‌కు మ‌ద్యం ప్ర‌సాదంగా ఇస్తే, కొన్ని చోట్ల జంతు బ‌లులు ఆచారంగా ఉంటాయి. ఇంకా కొన్ని ఆల‌యాల్లో దెయ్యాల‌ను వ‌ద‌ల‌గొట్టే సాంప్ర‌దాయాల‌ను కూడా పాటిస్తారు. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో ఉన్న ఇలాంటి విచిత్ర‌మైన ఆచారాల‌కు నెల‌వైన ప‌లు ఆల‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. కామాఖ్య ఆల‌యం
అస్సాంలోని గౌహ‌తిలో ఈ ఆల‌యం ఉంది. ఇక్క‌డ శివుడి మొద‌టి భార్య స‌తి అగ్నిలో దూకింద‌ట‌. దీంతో శివుడు తాండ‌వం చేస్తాడ‌ట. ఆ భ‌యానికి దేవ‌త‌లు మొర పెట్టుకోగా, విష్ణువు స‌తి శ‌రీర భాగాల‌ను క‌త్తిరిస్తాడ‌ట‌. అనంత‌రం స‌తికి చెందిన గ‌ర్భాశ‌యం, యోని ఇక్క‌డ ప‌డ్డాయ‌ట‌. అందుకే ఆ దేవి పేరిట ఆల‌యం వెలిసింద‌ని చెబుతారు. ఇక్క‌డి ఆల‌యంలో కొలువై ఉన్న అమ్మ‌వారిని కామాఖ్య దేవి అని పిలుస్తారు. జూన్‌లో ఈ ఆల‌యంలో దేవికి రుతుస్రావం అవుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో ప‌క్క‌నే ఉన్న బ్ర‌హ్మ‌పుత్ర న‌ది కూడా ఎర్ర‌గా మారుతుంద‌ని అంటారు. అందుక‌నే ఆల‌యాన్ని ఆ నెల‌లో మూడు రోజుల పాటు మూసేస్తారు. ఇక ఆ స‌మ‌యంలో న‌దిలో పారే నీటిని భ‌క్తుల‌కు ఇస్తారు.

2. కేదార్‌నాథ్ ఆల‌యం
కేదార్‌నాథ్ ఆల‌యం వ‌ద్ద వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు చుట్టూ ఉన్న ప‌రిస‌రాలు నాశ‌నం అయ్యాయి. కానీ ఆల‌యంతోపాటు దాని ఎదురుగా ఉన్న నంది విగ్ర‌హం మాత్రం చెక్కు చెద‌ర‌లేదు. ఇందుకు కార‌ణాలు ఏమిటో సైంటిస్టులు ఇప్ప‌టికీ క‌నుగొన‌లేకపోయారు. నిజంగా ఇది విచిత్ర‌మే.

 

3. హ‌నుమాన్ ఆలయం
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జ‌లువ‌న్ జిల్లా జగ్నేవా గ్రామంలో ఉన్న హ‌నుమాన్ ఆల‌య ప్రాంగ‌ణంలోని ఓ చేతిపంపు నీటికి అద్భుత శ‌క్తులున్నాయ‌ని స్థానికులు న‌మ్ముతారు. ఓ రుషి అక్క‌డ పూజ‌లు చేసి ఆ నీటికి ప‌విత్ర‌త వ‌చ్చేలా చేశాడ‌ని, అందుకే ఆ చేతిపంపులోంచి వ‌చ్చే నీరు అద్భుత శ‌క్తుల‌ను క‌లిగి ఉంటుంద‌ని స్థానికులు చెబుతారు.

4. బైత‌ల డ్యులా ఆల‌యం
భువ‌నేశ్వ‌ర్‌లో ఉన్న ఈ ఆల‌యంలో కాళీ మాత‌కు తాంత్రికులు పూజ‌లు చేస్తార‌ట‌. అతీత శ‌క్తుల‌ను సాధించ‌డం కోసం వారు ఆ ప‌ని చేస్తార‌ట‌.

5. బాలాజీ ఆల‌యం
ఢిల్లీకి 255 కిలోమీట‌ర్ల దూరంలో రాజ‌స్థాన్ రాష్ట్రంలోని దౌసా అనే జిల్లాలో ఉన్న బాలాజీ ఆల‌యంలో దెయ్యం ప‌ట్టిన భ‌క్తుల‌కు దెయ్యాన్ని వ‌ద‌ల‌గొడ‌తారు. ఇక్క‌డ వారిపై వేడి నీళ్లు పోస్తారు. జంతువుల‌ను క‌ట్టేసిన‌ట్లు క‌ట్టేస్తారు. అయినా బాధితుల‌కు ఏ మాత్రం నొప్పి తెలియ‌ద‌ట‌.

6. జ‌వాలా జి ఆల‌యం
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కంగ్రా జిల్లా లో ఈ ఆల‌యం ఉంది. ఇక్క‌డ స‌హ‌జ సిద్ధ‌మైన జ్వాలలు ఎప్ప‌టికీ మండుతూనే ఉంటాయి. ఇక్క‌డ మంట నీలి రంగులో ఉండ‌దు. దీనిపై అనేక మంది సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు చేశారు. కానీ ఇలా ఎందుకు జ‌రుగుతుందో క‌నిపెట్ట‌లేక‌పోయారు.

7. వెంక‌టేశ్వ‌ర ఆల‌యం
తిరుమ‌లలో ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఉండే గంట‌లు వాటంత‌ట అవే ఎప్ప‌టికీ మోగుతూ ఉంటాయ‌ట‌. ఇందుకు కార‌ణం సాక్షాత్తూ ఆ స్వామే ఆల‌యంలో కొలువై ఉండ‌డ‌మే అని భ‌క్తులు న‌మ్ముతారు. దీని వెనుక ఉన్న అస‌లు కార‌ణాన్ని మాత్రం ఎవ‌రూ క‌నిపెట్ట‌లేక‌పోయారు.

8. ఓమ్ బ‌న్నా ఆల‌యం
ఈ ఆల‌యానికి ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటో తెలిస్తే షాక్ తింటారు. ఎందుకంటే ఈ ఆల‌యంలో దేవుడు ఎవ‌రో తెలుసా.? ఓ బుల్లెట్‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఓ మోటార్ సైకిల్‌ను ఇక్క‌డ దేవుడిగా కొలుస్తారు. ఈ ఆల‌యం రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉంది. 1991లో ఓమ్ సింగ్ రాథోడ్ అనే వ్య‌క్తి ఈ ప్రాంతంలో బుల్లెట్ బైక్ న‌డుపుతూ ప్ర‌మాదంలో చ‌నిపోయాడ‌ట‌. దీంతో పోలీసులు ఆ బైక్‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే ఎవ‌రూ తేకుండానే ఈ బుల్లెట్ రాత్రికి రాత్రే మ‌ళ్లీ యాక్సిడెంట్ అయిన చోటుకు వ‌చ్చింద‌ట‌. దీంతో స‌ద‌రు ఓమ్ సింగ్ చ‌నిపోయినా ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని న‌మ్మిన అక్క‌డి స్థానికులు అత‌ని బైక్‌కే పూజ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు.

9. క‌ర్ణి మాత ఆల‌యం
రాజ‌స్థాన్‌లోని బిక‌నీర్‌కు దక్షిణం దిశ‌గా 30 కిలోమీట‌ర్ల దూరంలో దేష్ణోక్ అనే ప్రాంతంలో ఈ ఆల‌యం ఉంది. ఈ ఆల‌యంలో సుమారుగా 20వేల ఎలుక‌లు ఉంటాయి. ఇవే ఇక్క‌డి భ‌క్తుల‌కు దైవంతో స‌మానం. వీటికి భ‌క్తులు పాలు త‌దిత‌ర ఆహారాల‌ను పెడ‌తారు. దీంతో ఆల‌యంలో కొలువైన దుర్గా దేవి త‌మ‌ను అనుగ్ర‌హిస్తుంద‌ని న‌మ్ముతారు.

 

Comments

comments

Share this post

scroll to top