అద్ గది…..తెలుగోడి సత్తా…!! హీరో విశాల్ గెలుపుకు కారణాలు…!?

విజయం…భారీ విజయం…  పాతుకుపోయిన పెద్ద హీరో మీద… ప్రాంతీయతకు పెద్దపీట వేసే గడ్డ మీద… మన తెలుగోడు సత్తా చాటాడు.  తొడగొట్టి మరీ గెలుపు సాధించాడు. అతనే మన  హీరో విశాల్.  నడిగర్ సంఘం సినిమా ఎన్నికల్లో మనోడు శరత్ కుమార్ వర్గం మీద పై చేయి సాధించాడు. ఇక్కడ సినిమా ఎన్నికలనేది పక్కన పెడితే విశాల్ పోరాట పటిమను మెచ్చుకోవాల్సిందే. అంతే కాదు అతడి నుండి యువత చాలా నేర్చుకోవాలి.

అతని గెలుపు కారణాలు… ఇవి ముమ్మాటికి విజేత లక్షణాలే.

  • ఏ విజయం మామూలుగా ధరిచేరదు..దీని కోసం విశాల్ 2 యేళ్ళ గ్రౌండ్ వర్క్ చేశారు.
  • పెద్ద హీరోల తో పాటు ..  క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల మీద కాంన్సన్ ట్రేట్ చేశారు. వీరే పోలింగ్ బూతు ముందు లైన్లో  నిలబడి  ఓట్లేసేది అని గ్రహించాడు. సక్సెస్ అయ్యాడు.
  • యూత్ ను నిర్లక్ష్యం చేయలేదు. వారి ఓట్లు కీలకం అని నమ్మాడు.
  • శరత్ కుమార్, రాధిక ఇతనిది మన ప్రాంతం కాదు ..తెలుగు వాడు అంటూ రెచ్చగొట్టినా…ఎవ్వరూ  డైవర్ట్ కాకుండా చూసుకున్నాడు.
  • కమల్ హాసన్ మద్దతు కూడా కట్టగలిగాడు.
  • పేద కళాకారులను ఆదుకోవడం  లో శరత్ కుమార్ ఫెయిల్ అయ్యారని …. బేస్ ఉన్న ఆరోపణ ను ప్రచారఅస్త్రం గా వాడారు.
  •  ఎన్నికల ముందు ప్రత్యర్థి వర్గం కయ్యానికి వస్తే వెనకాడకుండా తాను కూడా కాలు దువ్వాడు. తెలివి,తెగువ రెండిటినీ ప్రదర్శించాడు
  • శరత్ కుమార్ పై విశాల్ పోటీ చేయడం వెనుక వేరే కారణం కూడా ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయ్. శరత్ కుమార్ కూతురు, విశాల్ లవర్స్ అని వారి పెళ్ళికి విశాల్ ఇంట్లో అందరూ ఒప్పుకున్నప్పటికీ, శరత్ కుమార్ ఇంట్లో ఒప్పుకోలేదని దాంతో అతనిపై కోపంతోనే ఎన్నికల్లోకి దిగి ఓడించాడనే ప్రచారం జరుగుతుంది.
  • విశాల్ స్వస్థలం. ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మధనపల్లి. నిర్మాతగా విశాల్ తండ్రి చెన్నైలో స్థిరపడ్డారు.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top