వాట్స‌ప్‌లో యూజ‌ర్ల డేటాను త‌స్క‌రిస్తున్న ఫేస్‌బుక్‌… త్వ‌ర‌లో ఆ సంస్థ‌పై భారీ జ‌రిమానా..?

ఈ-మెయిల్, ఇన్‌స్టంట్ మెసెంజ‌ర్ యాప్‌లే కాదు, ఏదైనా సంస్థ‌కు చెందిన ఏ యాప్‌ను వాడినా, వెబ్‌సైట్‌ను వాడినా యూజ‌ర్ల నుంచి అవి వారి ప్ర‌మేయం లేకుండా స‌మాచారం సేక‌రించ‌కూడదు. అలా సేక‌రించ‌డం చ‌ట్ట రీత్యా నేర‌మే అవుతుంది. ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు ఇలాంటి విష‌యాల్లో గ‌తంలో లా సూట్ల‌ను ఎదుర్కొన్నాయి. కొన్న‌యితే ఏకంగా పెద్ద మొత్తంలో జ‌రిమానాల‌ను కూడా క‌ట్టాల్సి వ‌చ్చింది. అయితే అలాంటి మ‌రో పెద్ద జ‌రిమానాకు ఫేస్‌బుక్ గురి కానుందా..? అంటే ఔన‌నే స‌మాధానం వినిపిస్తోంది. అదీ త‌న పిల్ల సంస్థ వాట్స‌ప్ వ‌ల్ల‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. వాట్స‌ప్ వ‌ల్లే ఫేస్‌బుక్‌కు ఇప్పుడు భారీ ఎత్తున జ‌రిమానా ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

facebook-whatsapp

ఇన్‌స్టంట్ మెసెంజ‌ర్ యాప్‌ల‌లో అగ్ర‌స్థానంలో దూసుకెళ్తున్న వాట్స‌ప్‌ను ఫేస్‌బుక్ గ‌తంలో కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే. అప్ప‌టి నుంచి అనేక మార్పులు చేర్పుల‌తో, నూత‌న ఫీచ‌ర్ల‌తో వాట్స‌ప్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. అయితే వాట్స‌ప్‌ను వాడుతున్న యూజ‌ర్ల డేటాను దాని మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ తీసుకుంటుంద‌ని, అలా తీసుకున్న డేటాను ఫేస్‌బుక్ విశ్లేషించి అందుకు అనుగుణంగా దాని సైట్‌లో యాడ్స్ ఇస్తుంద‌ని ఈ మ‌ధ్యే తెలిసింది. దీనిపై యూకేకు చెందిన ప‌లు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ సంస్థ‌లు ఇప్పుడు తీవ్రంగా ఆక్షేప‌ణ‌లు చేస్తున్నాయి. యూజ‌ర్ల డేటాను వారికి తెలియ‌కుండానే వాట్స‌ప్ నుంచి ఫేస్‌బుక్ తీసుకుంటుంద‌ని, దీన్ని ఆపాల‌ని ఆ సంస్థలు కోరుతున్నాయి.

దీంతో సాక్షాత్తూ యూకేకు చెందిన ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న‌ర్స్ ఆఫీస్ (ఐసీఓ) రంగంలోకి దిగింది. ఆ సంస్థ హెడ్ ఎలిజ‌బెత్ డెన్హ‌మ్ మాట్లాడుతూ యూజ‌ర్ల డేటాను వారి అనుమ‌తి లేకుండా తీసుకోవ‌డం నేర‌మ‌ని, అది గ‌న‌క రుజువైతే పెద్ద ఎత్తున ఫేస్‌బుక్ లా సూట్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. దీనిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపింది. ఈ క్ర‌మంలో ఫేస్‌బుక్ ప్ర‌స్తుతానికి అలా డేటా తీసుకోవ‌డం ఆపేసింద‌ని స‌మాచారం. నిజంగా ఒక వేళ ఫేస్‌బుక్ చేసింది రుజువైతే అప్పుడు ఆ సంస్థ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భారీ జ‌రిమానాను క‌ట్టాల్సి వ‌స్తుంద‌ట‌. ఎందుకంటే యురోపియ‌న్ చ‌ట్టాలు త్వ‌ర‌లో మ‌రింత ప‌టిష్టం కానున్నాయ‌ట‌. మ‌రి మ‌న ద‌గ్గ‌ర ఆ సంస్థ‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top