లవ్ బ్రేకప్ అయిన వాళ్ళకోసం “ఫేస్బుక్” కొత్త ఫీచర్..లవ్ ఫెయిల్ అయిన వారు తప్పక లవ్ చేస్తారు.!

ఫేస్‌బుక్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక మంది వాడుతున్న సోష‌ల్ మీడియా సైట్ ఇది. కొన్ని వంద‌ల కోట్ల మంది ఫేస్‌బుక్‌లో నిత్యం విహ‌రిస్తున్నారు. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు ఫేస్‌బుక్ ప్ర‌పంచంలోనే చాలా మంది ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతున్న యూజ‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ కూడా కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగానే త్వ‌ర‌లో మ‌రో ప‌వ‌ర్ ఫుల్ ఫీచ‌ర్‌ను ఫేస్‌బుక్ విడుద‌ల చేయ‌నుంది. అదేమిటంటే…

ఫేస్‌బుక్‌లో త్వ‌ర‌లో టేక్ ఎ బ్రేక్ అనే ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. దీని స‌హాయం యూజర్లు ఫేస్‌బుక్‌లో త‌మ ఫ్రెండ్స్ నుంచి వ‌చ్చే పోస్టుల‌ను కొన్ని రోజుల పాటు చూడ‌కండా నిరోధించ‌వచ్చు. దీంతో అవ‌త‌లి వారికి వారి పోస్టుల‌ను యూజ‌ర్ చూస్తున్నాడో లేదో తెలియ‌దు. ఇది యూజ‌ర్ల‌కు చాలా మేలు చేస్తుంది. ఫేస్‌బుక్‌లో ఎవ‌ర్నైనా అన్‌ఫాలో, బ్లాక్ చేయాల్సి వ‌స్తే అలా చేయ‌డం ఇష్టం లేక‌పోతే ఈ టేక్ ఎ బ్రేక్ ఫీచ‌ర్‌ను వాడుకోవ‌చ్చు. దాంతో యూజ‌ర్ల‌కు తాము వద్ద‌నుకునే వారి పోస్టులు కొన్ని రోజుల పాటు ఫేస్‌బుక్‌లో క‌నిపించ‌వు. ఇది ప్ర‌ధానంగా బ్రేక‌ప్ చేసుకున్న జంట‌ల‌కు అయితే బాగా పనికొస్తుంది.

ఇక టేక్ ఎ బ్రేక్ ఫీచ‌ర్‌లో భాగంగా యూజ‌ర్‌కు చెందిన పోస్టుల‌ను, ఫొటోల‌ను అవ‌త‌లి వారు చూడ‌కుండా కూడా సెట్ చేసుకోవ‌చ్చు. ఇందుకు అవ‌త‌లి వారిని అన్‌ఫాలో, బ్లాక్ చేయాల్సిన ప‌ని ఉండ‌దు. టేక్ ఎ బ్రేక్ ఫీచ‌ర్‌ను ఆన్ చేస్తే చాలు, అవ‌తలి వారు యూజర్‌కు చెందిన పోస్టులు, ఫొటోల‌ను టెంప‌రరీగా చూడ‌లేరు. ఈ టేక్ ఎ బ్రేక్ ఫీచ‌ర్ వ‌ల్ల ఎవ‌రూ ఎవ‌ర్నీ ఫేస్‌బుక్‌లో అన్‌ఫాలో, బ్లాక్ చేయాల్సిన ప‌ని ఉండ‌దు. కొద్ది రోజుల వ‌ర‌కు వారి పోస్టులు, ఫొటోల‌ను చూడ‌లేరు. అంతే..! ఇది.. జంట‌ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ టేక్ ఎ బ్రేక్ ఫీచ‌ర్ ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top