మమ్ముట్టి ని పొగడ్తలతో ముంచెత్తుతున్న సినీ జనాలు, ఫేస్ అఫ్ ఇండియన్ సినిమా-మమ్ముట్టి.

మమ్ముట్టి.. మలయాళం లో అతి పెద్ద స్టార్ హీరో, మమ్ముట్టి గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఫేస్ అఫ్ ఇండియన్ సినిమా’. భారతీయ చలన చిత్రం ముఖం గా వర్ణిస్తారు మమ్ముట్టి ని అభిమానులు, విమర్శకులు. విమర్శుకుల ప్రశంసలు ఎక్కువగా పొందిన యాక్టర్స్ లో మమ్ముట్టి మొదటి స్థానం లో ఉంటారు, 10 రోజుల క్రితం పెరంబు అనే తమిళ్ సినిమా విడుదల అయ్యింది, అందులో మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషించారు. ఒక ఎక్స్పరిమెంట్ మూవీ అయినా కూడా ఆయన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు, మూడు రోజుల క్రితం వచ్చిన యాత్ర సినిమా తో మరో సారి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు.

పాత్రలు రెండు, భాషలు రెండు.. :

వారం రోజుల వ్యవధిలో రెండు చిత్రాలు, ఒక దానికి మరొక దానికి అసలు పొంతనే లేదు. ఒకటి తమిళ్ మరొకటి తెలుగు. రెండు భాషల్లోనూ ఆయన ఎక్కువగా నటించలేదు, తెలుగు తమిళంలో మమ్ముట్టి నటించి దాదాపు రెండు దశాబ్దాల పైనే అయ్యింది. అయినా కూడా ఆయన అంటే తెలియని తెలుగు తమిళ్ సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు, ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో విలక్షణమైన నటనతో 350 కి పైగా సినిమాల్లో నటించారు మమ్ముట్టి.

రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో.. :

వై.ఎస్.ఆర్ బయోపిక్ యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో నటించిన మమ్ముట్టి గారిని తెలుగు ప్రేక్షకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు, పరభాషా నటుడు అయినా, భాష రాకపోయినా, ఒక మహానేత పాత్రలో అలవోకగా నటించారు మమ్ముట్టి, తప్పు తప్పు.. నటించారు అంటే తప్పవుతుంది, ఎందుకంటే మమ్ముట్టి గారు వై.ఎస్.ఆర్ గారి పాత్రలో జీవించేసారు. యాత్ర సినిమా లో మమ్ముట్టి నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. రాజన్న ను మళ్ళీ మమ్ముట్టి రూపం లో చూసుకున్నాం అని అభిమానులు ఆనందంగా చెబుతున్నారు.

నటన మాత్రమే తెలుసు అండి.. :

వయసు పెరిగేకొద్దీ మమ్ముట్టి గారి అందం పెరుగుతుంది, కొడుకు దుల్క్ ర్ సల్మాన్ సినిమాల్లో స్టార్ హీరో ట్యాగ్ కూడా సంపాదించుకున్నాడు, మమ్ముట్టి లాగే సల్మాన్ కూడా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ జనాల్ని మెప్పిస్తున్నాడు, సల్మాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే, ఓకే బంగారం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దేగ్గరైన సల్మాన్, మహానటి సినిమాతో మరింత చేరువయ్యాడు తెలుగు ప్రేక్షకులకు. అయితే మమ్ముట్టి గారికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడంటే ఎవ్వరు నమ్మరు, ఆయన ఫిట్నెస్ లెవెల్స్ అలా మెయింటైన చేస్తాడు మరి. కానీ మమ్ముట్టి గారికి నటన మాత్రమే తెలుసు, కేవలం నటనే.. అందుకే ఏ పాత్రలోనైనా ఇమిడిపోగలరు ఆయన.

 

Comments

comments

Share this post

scroll to top