విక్టరీ వెంకటేష్ , మెగా హీరో వరుణ్ తేజ్ హీరో లుగా నటిస్తున్న F2 చిత్రం ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు చిత్ర యూనిట్. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు, దిల్ రాజు F2 సినిమాకి నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ F2 సినిమా కి బాణీలు సమ కూర్చారు.
ఫుల్ ఫన్ ట్రైలర్ :
ఇప్పటికే విడుదలైన టీజర్ తో జనాల్లో మంచి మార్క్ లు కొట్టేశారు అనిల్ రావిపూడి. ట్రైలర్ లో తన మార్క్ చూపించాడు, తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా తో కూడా ఫ్యామిలిస్ ని బాగా ఎంటర్టైన్ చెయ్యనున్నాడు.
మిల్కీ భామలు :
మాములుగా తమన్నా అందాన్ని మ్యాచ్ చెయ్యాలి అంటే మిగిలిన హీరోయిన్స్ కి కొంచెం కష్టం, కానీ తమన్నా కి అందంలో పోటీ ఇవ్వగలిగే హీరోయిన్ ఒకరున్నారు, తనే మెహ్రీన్. తమన్నా మెహ్రీన్ F2 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లకు జంటగా నటించారు. ప్రకాష్ రాజ్ , పృద్వి F2 సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
F2 చిత్రం సంక్రాంతి పండుగకు అందరిని అలరించడం ఖాయం అని దిల్ రాజు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Watch VIdeo:
F2 Trailer – Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada