సంక్రాంతి అల్లుళ్ళ సందడి, పండక్కి సరైన సినిమా F2 – రివ్యూ & రేటింగ్.?

వెంకీ మామ సందడి మాములుగా లేదు థియేటర్ లో, 1st హాఫ్ అంతా వెంకీ మామ మయమే, చాలా రోజుల తరువాత విక్టరీ వెంకటేష్ మరో సారి మాయ చేసాడు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల తరువాత ఆ రేంజ్ లో జనాలని ఆకట్టుకున్న వెంకటేష్ చిత్రం ఇదే.

F2 – ఫర్ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీస్ :

ఒక్క మాట లో చెప్పాలి అంటే వెంకటేష్ ఫ్యాన్స్ కి మరియు ఫామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం పిచ్చ పిచ్చ గా నచ్చేస్తాది. అమ్మాయిల డామినేషన్ ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా లో వెంకటేష్ సరసన తమన్నా నటించింది, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించింది. వరుణ్ తేజ్ తన కెరీర్ లో ఇటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా లో నటించలేదు. ఫిదా మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా ఆ సినిమా లో సాయి పల్లవి మార్కులు కొట్టేసింది.

వెంకీ వరుణ్ కాంబో కేక :

వెంకటేష్ వరుణ్ తేజ్ లు తోడల్లుళ్లు ఈ సినిమా లో, అనిల్ రావిపూడి మరో సారి జనాల్ని మాయ చేసాడు, 1st హాఫ్ లో వెంకటేష్ సీన్స్ అయితే సూపర్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జనాలను ఆకట్టుకొనేలా ఈ చిత్రాన్ని అనిల్ మలిచిన తీరు అమోఘం. సుప్రీమ్, పటాస్, రాజా ది గ్రేట్ లో ఫైట్స్ అయినా ఉన్నాయ్, కానీ F2 మాత్రం మంచి క్లాస్ ఎంటర్టైనింగ్ మూవీ.

వన్ లైన్ : ఫ్యామిలీస్ కి పండగే :

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
వరుణ్ తేజ్
వెంకటేష్ కామెడీ

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ
సెకండ్ హాఫ్
దేవిశ్రీప్రసాద్ సంగీతం
క్లైమాక్స్

AP2TG రేటింగ్ :3/5

Comments

comments

Share this post

scroll to top