అమ్మాయిల కన్నులు చెప్పే రహస్యాలు….!

నీ చేప కళ్లు, చేప కళ్లు  గిచ్చుతున్నవే, నీ కోల కళ్లు కోల కళ్లు గిల్లుతున్నవే….ఇది ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ పాట….అయితే లిరిక్స్ లోపలికి వేళ్లే ప్రయత్నం కాదు కానీ అ కేవలం కళ్లు, కనుబొమ్మలను పరిశీలించి అవతలి వారు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయవచ్చట. అందమైన ఆ కళ్లలోకి చూస్తే ఇట్టే వారి మనస్తత్వాన్ని చెప్పోయొచ్చట..అంతేకదా మరి..ఆ కళ్లు వ్యక్తిత్వానికి నకళ్లు.!!!!
పిల్లి కళ్ల మాదిరిగా ఉంటే:
చిత్రంలో చూపిన విధంగా కళ్లు కలిగి ఉంటే వారు ఇతరులను ఎక్కువగా ప్రభావితం చేస్తారట. ప్రధానంగా మహిళలు ఇలాంటి కళ్లను కలిగి ఉంటే వారు మంచి మాటకారులుగా, స్వార్థపరులుగా ఉంటారట.
intoxicating_eye_stock_by_taylorinchains-d35yf9n
కలువపువ్వుల్లాంటి  కళ్లు: 
కలువ పూల లాంటి కళ్లను కలిగిన పురుషులు సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారట. వీరు ప్రతిభావంతులట. ఎవరినైనా సులభంగా ఆకట్టుకుంటారట. అదే మహిళలైతే ఏదైనా సాధించే తత్వం కలిగి ఉంటారట. వారు మంచి మాటకారులుగా కూడా ఉంటారట.
51
డో కళ్లు 
ఇలాంటి కళ్లను కలిగిన వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూల్‌గా, కామ్‌గా ఉంటారట. సాధారణంగా తమ భావాలను బయట పెట్టరట. మంచి హృదయం కలిగి ఉంటారట. ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం అందించే మనస్తత్వం కలిగి ఉంటారట. కొత్త వ్యక్తులను కూడా కలుపుకుని పోతారట.
140-audrey-hepburn-s-doe-eyed-look-960x605-2
 
తక్కువ ఎత్తున్న కనుబొమ్మలు:
కనుబొమల ఎత్తు తక్కువగా ఉన్నవారు అధిక శాతం తమ కుటుంబానికే ప్రాధాన్యతను ఇస్తారట. వీరు స్నేహితుల కన్నా కుటుంబ సభ్యుల కోసమే ఎక్కువ సమయం వెచ్చిస్తారట.
6df31d7cc9387b46b32ccbf762e65709
కనుబొమ్మలు సమాంతరంగా ఉంటే:
సమాంతరమైన కనుబొమలు కలిగి ఉన్న వారు నిజాయితీ పరులట. వీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అనునిత్యం కృషి చేస్తారట. వీరు ఆర్థికంగా లేకపోయినా తమ కష్టపడేతత్వంతో ఆ స్థాయికి ఎదుగుతారట.
How-to-get-rid-of-a-unibrow-permanently
దట్టమైన కనుబొమ్మలుటంటే:
కనుబొమలు దట్టంగా ఉన్నవారు చాలా అదృష్టవంతులట. వారి జీవన విధానం కలర్‌ఫుల్‌గా ఉంటుందట. వీరికి సాధారణంగా స్నేహితులు ఎక్కువగా ఉంటారట. వారికి సహాయం చేసేందుకు వెనుకాడరట. ఒత్తిడిని సులభంగా తట్టుకుంటారట.
Beauty-Trends-Fall-Winter-Mannish-Eyebrows
హై ఆర్క్ ఐబ్రోస్ :
కనుబొమల ఎత్తు ఎక్కువగా ఉన్నవారు చాలా ప్రతిభావంతులట. సింపుల్‌గా జీవించేందుకు ఇష్టపడతారట. వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారట.
hqdefault

Comments

comments

Share this post

scroll to top