కన్ను గీటి నా కెరీర్ ను చేసింది: హీరోయిన్ ఆవేదన!!

ఒరు ఆదార్ లవ్ టీజర్ లో కన్ను గీటి సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో రాత్రికే రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా వారియర్. కుర్రాళ్ళ మనసుల్ని తన కన్నులతో దోచేసుకుంది కేరళ కుట్టీ. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ వీడియో వైరల్ కావడంతో అదే పాపులారిటీతో ఈ సినిమాని తెలుగులో కూడా లవర్స్ డే పేరుతో సరిగ్గా ప్రేమికుల రోజే ఫిబ్రవరి 14న విడుదలయ్యింది. ఈ సినిమాలో ప్రియాతో పాటు రోషన్ అబ్దుల్, నూరిన్ షరీఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రయిలర్ లో కన్ను గీటి కుర్ర కారుని పిచ్చెoకించిన ప్రియా సినిమాలో మాత్రం తన యాక్టింగ్ తో మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కన్ను గీటిన సుందరి కన్నా నూరిన్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి.


అయితే మొదట ఈ సినిమాలో నూరిన్ నే ఫస్ట్ హీరోయిన్ అనుకున్నారట. కథలో కూడా నూరిన్ క్యారెక్టర్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట. అయితే ఈ సినిమా టీజర్ విడుదల చేసినప్పుడు ప్రియా ప్రకాష్ కి భారీ క్రేజ్ పెరిగింది. దీంతో సినిమా స్క్రిప్ట్ మొత్తం మార్చేశారంట. అయితే ఇదే విషయం పై నూరిన్ స్పందించింది. ప్రియా పాత్రకు ప్రధాన్యమిస్తూ తన పాత్రను ఈ సినిమాలో తగ్గించేశారిని వాపోయింది ఆమె. అంతే కాదు
ఈ కారణంగా తను చాలా ఆవేదనకు గురి అయ్యిందట. ప్రియా వలన తన కెరీర్ ఆగమైందని బాధపడింది. ఇకపై ఎప్పుడైనా ప్రియాతో నటించాలని ఎవరైనా అడిగితే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటుందట.

Comments

comments

Share this post

scroll to top