గర్భంతో ఉన్న మహిళలు చేయాల్సిన సులభతర వ్యాయామాలు. మీకు మీ పుట్టబోయే బిడ్డకు మంచింది.

గర్భంతో ఉన్న వారు వ్యాయామం చేయడం వలన వారికి పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే డెలివరీ కూడా చాలా సులభతరంగా జరుగుతుంది. అందుకే వైద్యులు ఇటువంటి సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని ఉంటారు. దీనివలన ఒత్తిడి తగ్గడం, ఎక్కువ బరువు పెరగకుండా ఉండడం లాంటి లాభాలు కలగడమే కాకుండా కాన్పు సమయంలో బాడీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందట. అయితే గర్భంతో ఉన్న స్త్రీలు ఎటువంటి వ్యాయామాలు చేయాలో ఇక్కడ చూపడం జరిగింది. 7 నెలలు దాటిన తర్వాత చాలా సింపుల్ వ్యాయామాలే చేయాలి.

7c5dev1foyr99brqhcbj

  • రెండు చేతులను ముందుకు చాచి, శరీరాన్ని ముందుకు వంచి, మోకాళ్ళపై ఉండటం
  • లేచి నిలబడి  కాళ్ళను ముందుకు వెనక్కు అంటూ ఉండటం
  • వాల్ స్లైడ్ వ్యాయామం
  • మడమలపై నిల్చోవడం
  • కుర్చీపై కూర్చొని  రోయింగ్ చేయడం
  • రొమ్ముభాగాలను పైకి కిందికి చేతులు తలకు ఆంచి చేయడం
  • చేతులను నిటారుగా నిలబెట్టి వ్యాయామం చేయడం
  • చేతులలో  బరువు ఉంచుకొని భుజాలతో వ్యాయామం
  • కండరాల వ్యాయామం
కండరాలు ఫిట్ గా,  ఉండటానికి ( కండరాల శక్తి మరియు భుజాలకు).
ఒక చైర్ చివర్న ఫిట్ గా కూర్చొని  వీపు భాగాన్ని నిటారుగా ఉంచుకొని పాదాలను భూమికి తగిలేట్లుగా ఉంచాలి. చేతులను పక్కకు ఉంచి రెండు చేతుల్లోనూ 5 పౌండ్ల బరువును ఉంచి, ఆ చేతులను ముఖానికి కనిపించే విధంగా వ్యాయామం చేయాలి. మీ చేతులను వంచడం వలన చేతులు 90 డిగ్రీల కోణంలో ఉన్నట్లుగా ఉంటాయి. అలా చేతుల పట్టుకున్న బరువును భుజాల వరకు ఎత్తుతూ, మోచేతులను కిందకు పైకి అంటూ ఉండాలి.ఇలా కొద్దిసేపు చేస్తూనే ఉండాలి.
hpp049yauxvk3ghquxhf
చేతులు, వీపు భాగం బలంగా ఉండటానికి:
నిటారుగా కాళ్ళను చాంచి, మోచేతులపై, భుజాలపై భారాన్ని మోపి, అలానే 5 సార్లు పైగా శ్వాస తీసుకోండి. 1,2 సార్లు శ్వాసను అలానే పట్టుకోండి. ఇలా రోజుకి ఒక 5 నిముషాల పాటు చేయడం మంచిది.
aftf7ni2hlfb2r2bo83w
ఒక చేయిపై వ్యాయామం (కండరాలకు శక్తినిస్తుంది, బాహ్యభాగము ధృడంగా ఉంటుంది):
మీ కుడి మోకాలును కుర్చీలో ఉంచండి మరియు ఎడమ మోకాలును భూమికి  తాకుతూ ఉంచండి. కొద్దిగా మీ వీపును కిందికి వంచి బరువును కుడిచేతిపై ఉండేలా చూసుకోండి. ఆ కుడిచేతిని కుర్చీపై ఉండనివ్వండి. ఇక ఎడమ చేతిలో 5 పౌండ్ల బరువును ఉంచి భుజానికి నిటారుగా ఒకసారి మరియు భూమికి కిందగా ఒకసారి చేయండి. కొన్ని సెకన్లు మీ ఎడమ మోచేతిని వంచి పట్టుకొని ఉండండి. దాని తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చి కొద్దిసేపటి తర్వాత వ్యాయామాన్ని మొదలుపెట్టండి.
njn9imcv1qrwgql6rt0e

Comments

comments

Share this post

scroll to top