అన్నీ తెలిసి మనిషి ఇరకాటంలో పడిపోతాడెందుకనీ..? అంటూ జీవిత తత్త్వాన్ని సమగ్రంగా వివరించిన పాట.

అంతా మాయ…మాయ అంటూ జీవిత తత్త్వాన్ని చెప్పే ప్రయత్నమే ఈ పాట.  అన్నీ తెలిసి మనిషి ఇరకాటంలో పడిపోతాడెందుకనీ అంటూ  అతని అత్యాశ ను, అజ్ఙానాన్ని ప్రశ్నిస్తాడు.  వేదం తెలుసు ..తైలమున్నంత వరకే దీపమనే వేదాంతం తెలుసు అనే లైన్ లో బతికున్నంత వరకే మనకీ లెక్కలని మన జీవితం తామరాకు పై నీటి బొట్టులాంటిదని పాట రూపంలో చాలా సున్నితంగా….భావ రూపంలో చాలా గట్టిగా చెప్పే ప్రయత్నమే ఈ పాట. ఓ సారి పాట వినండి మీ ఆటిట్యూడ్ లో అనంతమైన మార్పు తీసుకొస్తుంది ఈ పాట.

Watch Video:

Lyrics: 

భ్రమ అని తెలుసు
బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు
కథ అని తెలుసు
కథలన్ని కంచికే చేరునని తెలుసు
తెలుసు తెర తొలుగుతుందని
తెలుసు తెల్లారుతుందని …
తెలుసు ఈ కట్టె పుట్టుక్కు మంటదని
తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని …
ఇన్ని తెలిసి ఇరకాటంలొ పడిపోతాము ఎందుకని?
మాయ … మాయ

వేదం తెలుసు …
తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు
శాస్త్రం తెలుసు …
శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు ….
తెలుసు ఇది నీటి మూటని …
తెలుసులే ఇది గాలి మేడని …
తెలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని ….
తెలుసు ఉట్టి పై ఉన్నదంతా ఉష్కాకాకియనీ …
అన్నీ తెలిసి అడుసులొ పడి దొర్లుతుంటాము దేనికని
మాయ … మాయా… మాయా

తేలిపోయింది … తెలిసిపోయింది …
తెలియనిదేదో ఉందని మనసా …
తెలుసని ఎందరు చెబుతున్నా అది … ఉందో లేదో తేలని హంసా ….
కళ్ళు రెండూ మూసెయ్యలంటా …. మూడో కంటిని తెరవాలంటా …
మిన్ను మన్నూ మిట్టా పల్లం ఒక్కటిగా కనిపించాలంటా …
ఆడే వాడు ఆడించే వాడు  ఏకపాత్రలని ఎరగాలంటా …
ఆ ఎరుక వచ్చి రాగానే
మాయం అయిపోతుందట మాయ… మాయా… మాయా.

Comments

comments

Share this post

scroll to top