నేడు మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి పెద్ద సమస్య.. ఆత్మహత్యలు. నేటి తరుణంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలే వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులైతే ఈ సమస్య బారిన పడుతున్నారు. నిండైన జీవితానికి మధ్యలోనే ముగింపు పలుకుతున్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2015 లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి గంటకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వారిలో 10 నుంచి 12వ తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నారు. తాజాగా ఓ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతను పరీక్షలు సరిగ్గా రాయనందుకు కాదు, 9 మార్కులు వచ్చే 3 ప్రశ్నలను వదిలేసినందుకు..!
అవును మీరు విన్నది నిజమే. ఆ విద్యార్థి 12వ తరగతిలో ఫిజిక్స్ ఎగ్జామ్‌లో 9 మార్కులు వచ్చే 3 ప్రశ్నలను వదిలేశాడు. టైం లేక కాదు, ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఆ పనిచేశాడు. దీంతో తనకు మార్కులు తక్కువ వస్తాయని, చదువుల్లో అందరికన్నా వెనుకబడుతానని అతను భావించాడు. తన జీవితాన్ని మధ్యలోనే ముగించేశాడు. బలన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి పేరు కరణ్వీర్ సింగ్. వయస్సు 17 సంవత్సరాలు.
కరణ్‌వీర్‌సింగ్ ఉంటున్నది మొహాలీలో. 12వ తరగతి చదువుతున్నాడు. పరీక్షలకు తన ఇంట్లో ఉంటే ఆటంకం కలుగుతుందని అతను భావించాడు. దీంతో తన తాత ఇంట్లో ఉండి ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతూ అక్కడి నుంచే సెంటర్‌కు వెళ్లి ఎగ్జామ్స్ రాసి రావడం మొదలు పెట్టాడు. అందులో భాగంగానే తాజాగా ఫిజిక్స్ పేపర్ రాశాడు. అందులో మార్కులు తక్కువ వస్తాయని భయపడి సూసైడ్ చేసుకున్నాడు. నిజానికి కరణ్‌వీర్‌సింగ్ చదువుల్లో టాపర్. టెన్త్‌లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించాడు. ఇప్పుడు సెకండియర్‌లో ఉన్నడు. త్వరలో ఐఐటీ ఎంట్రన్స్ రాసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అంతలోనే ఈ ఘోరం జరిగింది. దీనికి బాధ్యులెవరు ? మార్కుల కోసం పిల్లల్ని పట్టి పీడించే తల్లిదండ్రులా ? వారికి చదువు చెప్పే గురువులా ? స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలా ? ఇందుకు వీరందరూ సమాధానం చెప్పాల్సిందే. ఇంకా ఎందరు ఇలా బలవుతారో.. దీన్ని ఆపి తీరాల్సిందే..!