ఈ విష‌యం తెలిస్తే.. ఇక‌పై మీరు సినిమా థియేట‌ర్ల‌లో పాప్ కార్న్‌ను కొన‌రు తెలుసా..?

పాప్ కార్న్‌.. ఇది అంటే చాలా మందికి ఇష్ట‌మే. చిన్నా పెద్దా తేడా లేకుండా పాప్ కార్న్‌ను చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సినిమా థియేట‌ర్ల‌కు వెళ్లిన‌ప్పుడు సినిమా చూస్తూ కొంద‌రు పాప్ కార్న్‌ను ఎడా పెడా లాగించేస్తారు. నిజానికి పాప్ కార్న్ ఇత‌ర జంక్ ఫుడ్ జాబితాలోకి రాదు. క‌నుక దాన్ని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది పాప్ కార్న్ వ‌ల్ల క‌లిగే లాభాలు మాత్రం కాదు. మ‌రేమిటంటే…

సాధార‌ణంగా సినిమా థియేట‌ర్ల‌లో ఎవ‌రైనా పాప్ కార్న్‌ను కొంటారు. కానీ అక్క‌డ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ ఏదో ఒక‌టి తినాల‌ని చూస్తారు కనుక‌, రేట్ ఎక్కువ ఉన్నా పాప్ కార్న్‌ను కొనుగోలు చేస్తారు. ఇక పీవీఆర్ లాంటి మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌లో అయితే పాప్ కార్న్ ను ముట్టుకోవాలంటే భ‌య‌మేస్తుంది. చిన్న‌ప్యాక్‌ను తీసుకున్నా రూ.150కి పైగానే వ‌సూలు చేస్తారు. ఇక పెద్ద ప్యాక్ అయితే రూ.300 వ‌ర‌కు ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ అంత‌టి ధ‌ర వెచ్చించి మ‌రీ ఆ థియేట‌ర్ల‌లో పాప్‌కార్న్‌ను చాలా మంది కొంటున్నారు. అయితే అస‌లు విష‌యం తెలిస్తే మీరు ఇక‌పై పీవీఆర్ లాంటి మాల్స్‌లో పాప్‌కార్న్‌ను కొన‌రు. ఎందుకో తెలుసా..?

ఏమీ లేదండీ.. కేవ‌లం పాప్‌కార్న్‌ల‌ను అమ్మ‌డం ద్వారానే 2017వ సంవ‌త్స‌రంలో పీవీఆర్ సినిమాస్ యాజ‌మాన్యం రూ.580 కోట్ల‌ను ఆర్జించిందట‌. షాకింగ్‌గా లేదూ.. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న ద‌గ్గ‌ర ఎక్కువ డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం వ‌ల్లే అంత లాభం వారికి వ‌చ్చింది. కానీ ఈ విష‌యం మాత్రం మ‌నం పట్టించుకోం. బ‌య‌ట మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌రకు పాప్‌కార్న్ ల‌భించినా అందుకు 10 రెట్ల ఎక్కువ ధ‌ర పెట్టి థియేట‌ర్ల‌లో కొంటాం. చివ‌ర‌కు వారు ఇదిగో.. ఇలా అధిక డ‌బ్బులు వ‌సూలు చేసి లాభాలు గ‌డిస్తూ మ‌న‌ల్ని వెర్రి వెధ‌వ‌ల్ని చేస్తారు. క‌నుక ఇక‌పై మీరు థియేట‌ర్ల‌లో పాప్‌కార్న్‌ను కొనేముందు ఆలోచించండి. ఆ కొనేదేదో బ‌య‌ట చిరు వ్యాపారుల ద‌గ్గ‌ర కొంటే వారికి లాభం చేకూర్చిన వార‌మ‌వుతాం. అంతే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top