మ‌న దేశానికి సేవ‌లు అందించిన ఈ 10 పోలీస్ అధికారుల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

పోలీసుగా విధులు నిర్వ‌హించ‌డం అంటే మాట‌లు కాదు. నిత్యం ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉన్న‌తాధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, రాజ‌కీయ నాయకుల నుంచి వ‌చ్చే ఒత్తిళ్ల‌ను అధిగ‌మించాల్సి వ‌స్తుంది. దీనికి తోడు స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అదుపు చేయాలి. నేరాల‌ను చేసే వారిని ప‌ట్టుకోవాలి. వీవీఐపీల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలి. ఏవైనా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగితే వెంట‌నే స్పందించాల్సి ఉంటుంది. ఇలా.. పోలీసులు నిత్యం చేసే ప‌ని క‌త్తి మీద సాములా ఉంటుంది. అయితే అలాంటి ప‌నిని కూడా సునాయాసంగా చేస్తూ ఎన్నో ఘ‌ట‌న‌ల్లో అత్యంత ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించారు కొంద‌రు పోలీసు అధికారులు. వారి గురించి ఇప్పుడు కింద తెలుసుకుందాం.

1. హేమంత్ క‌ర్క‌రె
2008 న‌వంబ‌ర్ 26వ తేదీన ముంబైలో టెర్ర‌రిస్టుల దాడి జ‌రిగిన‌ప్పుడు ఈయ‌న విధులు నిర్వ‌హించారు. ముంబై చ‌త్ర‌ప‌తి శివాజీ ట‌ర్మిన‌స్‌లో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి భీభ‌త్సం సృష్టిస్తున్నార‌న్న సమాచారం అందిన వెంట‌నే ఈయ‌న మ‌రో ఇద్ద‌రు పోలీస్ అధికారుల‌తో క‌లిసి రంగంలోకి దిగారు. ఉగ్ర‌వాదుల పీచమ‌ణిచారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ వారి కాల్పుల‌కు ఆయ‌న మృతి చెందారు.

2. విజ‌య్ స‌లాస్క‌ర్
ఈయ‌న ఓ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌. ముంబై ప్ర‌జ‌ల‌కు ఈయ‌న ధైర్య సాహ‌సాల గురించి తెలుసు. 2008లో న‌వంబ‌ర్ 26వ తేదీన జ‌రిగిన ముంబై దాడుల్లో హేమంత్ క‌ర్క‌రె తో ఈయ‌న కూడా ఉన్నారు. ఈయ‌న కూడా ఆ రోజు మృతి చెందారు.

3. అశోక్ కామ్టే
ఈయ‌న పోలీస్ మాత్ర‌మే కాదు, స్వ‌త‌హాగా బాడీ బిల్డ‌ర్ కూడా. అనేక మెడ‌ల్స్‌ను ఆ రంగంలో సాధించారు. పోలీస్ మెడ‌ల్స్ కూడా పొందారు. 2008 న‌వంబ‌ర్ 26 ముంబై దాడుల్లో పైన చెప్పిన ఇద్ద‌రు ఆఫీస‌ర్ల‌తో క‌లిసి ఈయ‌న ప‌నిచేశారు. అదే రోజు టెర్ర‌రిస్టుల తూటాల‌కు మృతి చెందారు.

4. మోహ‌న్ చంద్ శ‌ర్మ
ఢిల్లీ పోలీస్ స్పెష‌ల్ సెల్ విభాగంలో ప‌నిచేశారు. 35 మంది టెర్ర‌రిస్టుల‌ను హ‌త‌మార్చారు. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా పేరుగాంచారు. 80 మంది టెర్ర‌రిస్టుల‌ను స్వ‌యంగా అరెస్టు చేశారు. 2008లో బాట్లా ఎన్‌కౌంట‌ర్ టీమ్‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. ఢిల్లీలో జ‌రిగిన ఓ ఎన్‌కౌంట‌ర్ అటాక్‌లో మ‌ర‌ణించారు.

5. వినోద్ కుమార్ చౌబే
ఈయ‌న న‌క్స‌ల్స్ స్పెష‌లిస్ట్‌గా పేరుగాంచారు. ఎన్నో టీంల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. ఎలాంటి జంకు లేకుండా అత్యంత ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ప‌నిచేయ‌డంలో ఈయ‌న‌కు ఈయ‌నే సాటిగా గుర్తింపు పొందారు. జూలై 2009లో మ‌ర‌ణించారు.

6. శివ‌దీప్ వ‌మ‌న్ లాండె
ఈయ‌న ఎస్పీగా చార్జి తీసుకున్న‌ప్పుడు పాట్నాలో ప‌నిచేశారు. కేవ‌లం 10 నెల‌ల కాలంలోనే అనేక మాఫియాల ఆగ‌డాల‌ను అరిక‌ట్టారు. ట్రాఫిక్ రూల్స్‌ను స్ట్రిక్ట్‌గా అమ‌లు చేశారు. ఈయ‌న త‌న ఫోన్ నంబ‌ర్‌ను మ‌హిళ‌లంద‌రికీ ఇచ్చారు. ఏ స‌మ‌యంలోనైనా త‌న‌కు కాల్ చేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం ఈయ‌న చేసి కృషి ఈయ‌న‌కు ఎంతో మంది అభిమానులను తెచ్చి పెట్టింది.

7. కె.ప్ర‌సాద్ బాబు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో యాంటీ న‌క్స‌ల్ ఫోర్స్‌లో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. అనేక మావోయిస్టు ఆప‌రేష‌న్ల‌లో పాల్గొని ధైర్య సాహసాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఒకానొక స‌మ‌యంలో త‌న వ‌ద్ద బుల్లెట్లు ఏమీ లేక‌పోయినా న‌క్స‌ల్స్‌తో వీరోచిత పోరాటం చేశారు. ఏప్రిల్ 17, 2013లో న‌క్స‌ల్స్‌తో పోరులో వీర మ‌రణం పొందారు.

8. రుక్సానా కౌస‌ర్‌
ఈమెను ఈమె ప‌నిచేసిన ప్రాంతంలో బీబీ అని ముద్దుగా ప్ర‌జ‌లు పిలుచుకునేవారు. ఎందుకంటే ఆమె పోలీస్ వృత్తిలో అత్యంత ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ విధులు నిర్వ‌హిస్తుంది కనుక ఈమెను అలా పిలిచేవారు. ఈమెకు 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు కాశ్మీర్‌లో త‌న ఇంట్లోకి దూరిన 3 మంది ఎల్ఈటీ టెర్ర‌రిస్టుల‌పై వీరోచిత పోరాటం చేసి వారిని అంతమొందించింది. దీంతో ఆమెకు కాశ్మీర్‌లో స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ గా ఉద్యోగం ఇచ్చారు.

9. అజిత్ కుమార్ దోవ‌ల్
ఈయన గురించి అంద‌రికీ తెలుసు. పాకిస్థాన్ ఆర్మీ క్యాంప్‌పై భార‌త్‌ స‌ర్జిక‌ల్ దాడులు నిర్వ‌హించ‌డం వెనుక వ్యూహ‌క‌ర్త ఈయ‌నే. ఇంటెల్లిజెంట్ బ్యూరోలో ప‌నిచేశారు. ప్ర‌స్తుతం నేష‌న‌ల్ సెక్యూరిటీ అడ్వ‌యిజ‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. కీర్తి చ‌క్ర అవార్డును సాధించారు. 7 సంవ‌త్స‌రాల పాటు పాకిస్థాన్‌లో అండ‌ర్ క‌వ‌ర్ ఏజెంట్‌గా ప‌నిచేసి భార‌త్‌కు కీల‌క స‌మాచారం చేర‌వేశారు. 1980ల‌లో అమృత‌స‌ర్ గోల్డెన్ టెంపుల్ లో టెర్ర‌రిస్టులు దూరిన‌ప్పుడు ఈయ‌న ఓ టెర్ర‌రిస్టుగా మారి టెంపుల్‌లో ఉన్న వారి గురించి స‌మాచారం ఇచ్చి అందులోని వారిని ర‌క్షించేలా చేశారు.

10. వీవీ ల‌క్ష్మీ నారాయ‌ణ
దేశంలో ఉన్న నిజాయితీ ప‌రులైన ఐపీఎస్ పోలీస్ ఆఫీస‌ర్ల జాబితాలో ఈయ‌న ముందు వ‌రుస‌లో ఉంటారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. అవినీతి ప‌రుల గుండెల్లో సింహ స్వ‌ప్నంగా నిలిచారు. 2జీ స్కాం, స‌త్యం కుంభ‌కోణం, సోహ్రాబుద్దీన్ న‌కిలీ ఎన్‌కౌంట‌ర్‌, వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు వంటి ఎన్నో కేసుల్లో ఈయన కీల‌కంగా ప‌నిచేశారు. ఇండియ‌న్ పోలీస్ మెడ‌ల్‌ను అందుకున్నారు.

http://madcarblog.com/1-4-2-2/

Comments

comments

Share this post

scroll to top